Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తప్పు నాది కాదు: 'అధ్యక్ష పదవికి రాజీనామా చెయ్యను'

హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ జట్టు చెత్త ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ మాజీ దిగ్గజ క్రికెటర్ అర్జున్ రణతుంగ చేసిన డిమాండ్‌ను తిలంగా సుమతిపాల తోసిపుచ్చారు.

జట్టు వైఫల్యానికి క్రికెట్ పరిపాలన విభాగం తప్పిదం లేదనే విషయాన్ని తెలుసుకోవాలని రణతుంగకు సూచించాడు. 'నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. జట్టు ఆడకపోతే అది మా సమస్య కాదు. మైదానంలో ఆడే జట్టు సరైన ప్రదర్శన చేయకపోతే క్రికెట్ పరిపాలన విభాగం ఏం చేస్తుంది. మా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు' అని సుమతిపాల అన్నాడు.

No stepping down as Sri Lanka cricket boss: Sumathipala

తాను ఎట్టిపరిస్థితుల్లోనూ క్రికెట్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనని సుమతిపాల తేల్చి చెప్పాడు. ప్రస్తుతం శ్రీలంక పెట్రోలియం మంత్రిగా ఉన్న అర్జున్ రణతుంగ తమ దేశ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టాలంటూ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు, ప్రధాని రణిల్ విక్రమ్ సింఘేకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేసి తాత్కాలికంగా కమిటీ ఏర్పాటు చేయాలని వారికి రణతుంగ ఆ లేఖలో విన్నవించాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అవలంభిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శ్రీలంక క్రికెట్ పరిపాలనలో అసహ్యకర వాతావరణం నెలకొందంటూ తీవ్రంగా విమర్శించారు.

ప్రస్తుతం శ్రీలంక... టీమిండియాతో ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడుతుంది. వన్డే సిరిస్‌కు ముందు జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 0-3తో వైట్ వాష్‌కు గురైంది. ఇక, ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో కోల్పోయింది. ఈ సిరిస్‌లో ఇంకా రెండు వన్డేలు మిగిలున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+