Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ గొడవే కారణమా?: గ్రేట్ కెప్టెన్ల జాబితాలో దాదా లేడు

హైదరాబాద్: భారత క్రికెట్‌కు సేవలందించిన అత్యుత్తమ క్రికెటర్లలో సౌరభ్ గంగూలీ ఒకడు. మాజీ క్రికెటర్లు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి మాత్రం భారత అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో గంగూలీకి స్థానం ఇవ్వలేదు.

విస్డన్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి ధోనియే అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు. అయితే ధోని తర్వాతి మూడు స్థానాల్లో కూడా గంగూలీకి చోటు కల్పించకపోవడం విశేషం. 'భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ ధోనీనే. అతడికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అతడి తర్వాత కపిల్‌ దేవ్‌ ఉంటాడు. అతను 1983 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. వన్డేలు రాకముందు వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో జట్టును గెలిపించిన వాడేకర్‌ తర్వాత నిలుస్తాడు. దూకుడుకు మారుపేరైన టైగర్‌ పటౌడీ ఈ జాబితాలో తర్వాత ఉంటాడు'' అని శాస్త్రి పేర్కొన్నాడు.

ధోనికి దాదా అనే పదాన్ని తగిలించాడు

ధోనికి దాదా అనే పదాన్ని తగిలించాడు

కపిల్ దేవ్, అజిత్ వాడేకర్, టైగర్ పటౌడీ, మహేంద్ర సింగ్ ధోనిలే భారత అత్యుత్తమ కెప్టెన్ల అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు. అంతేకాదు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి దాదా అనే పదాన్ని తగిలించాడు. 'దాదా కెప్టెన్' ధోని అంటూ కితాబిచ్చాడు. 'ఎంఎస్ ధోని సాధించలేనిది ఏదీ లేదు. దాంతో పాటు అతను నిరూపించుకోవాల్సి కూడా ఏమీ లేదు. కోహ్లికి పగ్గాలు అప్పజెప్పడానికి ధోని చేసిన త్యాగం చేశాడు. దాదా కెప్టెన్‌కు సలాం' అని అన్నాడు.

టీమిండియా క్రికెట్ కోచ్ పదవి విషయంలో గొడవ

టీమిండియా క్రికెట్ కోచ్ పదవి విషయంలో గొడవ

భారత క్రికెట్‌ కోచ్‌ పదవికి తనను కాదని కుంబ్లేను ఎంపిక చేసిన విషయంలో రవిశాస్త్రి తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఈ అసంతృప్తితోనే రవిశాస్త్రి అతడి పేరును ఉద్దేశపూర్వకంగానే విస్మరించాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ధోని నెంబర్ ఎందుకంటే

ధోని నెంబర్ ఎందుకంటే

మరోవైపు తన జాబితాపై రవిశాస్త్రి ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ గణాంకాలాను నమోదు చేసిన భారత కెప్టెన్లకే తన జాబితాలో స్థానం కేటాయించినట్లు పేర్కొన్నాడు. తన కెరీర్‌లో 49 టెస్టులకు సారథ్య వహించిన సౌరభ్ గంగూలీ 42.6 విజయశాతాన్ని నమోదు చేశాడు.

గంగూలీపై పైచేయి సాధించేందుకు యత్నం

గంగూలీపై పైచేయి సాధించేందుకు యత్నం

ఇక 147 వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న గంగూలీ 76 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయానందించాడు. అయితే రవిశాస్త్రి మాత్రం వీలుచిక్కినప్పుడల్లా గంగూలీపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+