న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వద్దు సార్‌.. అతడు జట్టును నాశనం చేస్తాడు: ధోనీ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శ్రీనివాసన్‌

No sir, he’ll spoil the team: When MS Dhoni refused to take an outstanding player in CSK
IPL 2020 : MS Dhoni’s Chennai Super Kings To Arrive In UAE Early Before One Week || Oneindia Telugu

చెన్నై: ఓ స్టార్‌ ఆటగాణ్ని జట్టులోకి తీసుకుందామని ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ అన్నప్పుడు.. ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ వద్దని చెప్పాడట. 'వద్దు సార్‌.. అతడు జట్టును నాశనం చేస్తాడు' అని శ్రీనివాసన్‌తో మహీ మొహం మీదే చెప్పాడట. ఈ విషయాన్ని శ్రీనివాసనే స్వయంగా చెప్పారు. ఐపీఎల్‌లో‌ సీఎస్‌కే మూడు టైటిళ్లు గెలుచుకుని లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇక ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ కూడా ఒకడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే ఇప్పటివరకూ 10 సీజన్లు ఆడగా.. అన్నింటికీ మహీ కెప్టెన్‌గా వ్యహరించాడు.

ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. సెప్టెంబరు 19న ఆరంభం.. నవంబరు 10న ఫైనల్‌!!ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. సెప్టెంబరు 19న ఆరంభం.. నవంబరు 10న ఫైనల్‌!!

వద్దు సార్‌.. అతడు జట్టును నాశనం చేస్తాడు:

వద్దు సార్‌.. అతడు జట్టును నాశనం చేస్తాడు:

గ్రేట్‌ లేక్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించిన సెమినార్‌లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, సీఎస్‌కే యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్‌ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ... మహీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. 'గతంలో ఐపీఎల్‌లో ఒక ప్రత్యేక ఆటగాడ్ని నేను సూచించా. అతను విపరీతమైన టాలెంట్‌ ఉన్న ఆటగాడు. అయినా ధోనీ వద్దన్నాడు. "వద్దు సార్‌.. అతడు జట్టును నాశనం చేస్తాడు" అని నాతో అన్నాడు. ఆ సమయంలో జట్టు ఐక్యంగా ఉండడమే ముఖ్యం అనుకున్నా' అని శ్రీనివాసన్‌ తెలిపారు.

ఆటగాడిని అంచనా వేయడంలో దిట్ట:

ఆటగాడిని అంచనా వేయడంలో దిట్ట:

'ఏ ఆటగాడినైనా అంచనా వేయడంలో ఎంఎస్ ధోనీ దిట్ట. ఒక ఆటగాడి పట్ల ఒకటి ఫిక్స్‌ అయితే దానికి మహీ కట్టుబడి ఉంటాడు. అభిప్రాయాన్నైనా, అపోహనైనా ధోనీ తేల్చిచెబుతాడు. అతని జడ్జ్‌మెంట్‌ అలానే ఉంటుంది. అమెరికాలో చాలా ఏళ్లుగా ఫ్రాంఛైజీ కేంద్రంగా ఆటలు నడుస్తున్నాయి. భారత్‌లో ఇప్పుడిప్పుడే అది మొదలైంది. అయితే జూనియర్‌ స్థాయిలో జట్లను నడిపించిన అనుభవం ఇండియా సిమెంట్స్‌కు ఉంది' అని శ్రీనివాసన్‌ చెప్పారు.

20021 ఐపీఎల్‌లో కూడా ఆడుతాడు:

20021 ఐపీఎల్‌లో కూడా ఆడుతాడు:

మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇంతకుముందు శ్రీనివాసన్‌ మాట్లాడుతూ... 'ధోనీ 2020 ఐపీఎల్‌ ఆడుతాడు. 2020 ఐపీఎల్‌తో పాటు 20021 ఐపీఎల్‌లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం' అని శ్రీనివాసన్‌ చెప్పుకొచ్చారు.

ప్రారంభం నుండి చెన్నై జట్టుకే:

ప్రారంభం నుండి చెన్నై జట్టుకే:

ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకే ఆడుతున్నాడు. సారధిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నిషేధం సమయంలో రెండు సంవత్సరాలకు పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడాడు. మహీ చెన్నై జట్టుకు మూడుసార్లు టైటిల్‌ అందించాడు. గతేడాది హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో తలపడి ఒక్క పరుగుతో చెన్నై ఓటమిపాలైంది. అయితే ఈసారి టైటిల్ గెలవాలని చెన్నై కసిగా ఉంది.

Story first published: Monday, August 3, 2020, 8:13 [IST]
Other articles published on Aug 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X