Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత స్పిన్నర్లను ఎదుర్కొనడం ఎలా?: ఆసీస్ వ్యూహామిదే

హైదరాబాద్: భారత స్పిన్నర్లను భారత్‌లో ఎదుర్కొని నిలవడం అంత సులభం కాదని ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్ స్కాండ్ అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం భారత పర్యటన కోసం వస్తున్న జట్టులో హ్యాండ్ స్కాండ్ ఒకడు.

భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుని మైండ్ గేమ్‌తో కట్టడి చేయాలని భావిస్తోన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలని అనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

 No single solution to battle India spinners, says Peter Handscomb

ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియాకి ఇచ్చిన ఇంటర్యూలో హ్యాండ్ స్కాండ్ మాట్లాడుతూ భారత్ స్ఫిన్నర్లను ఎదుర్కొనడానికి తమ వద్ద ఏదొక పరిష్కారమైతే ఉందని తాను అనుకోవడం లేదన్నాడు. సరైన ప్రణాళికతో ఆడితేనే భారత్‌లో రాణించే అవకాశం ఉందని చెప్పాడు.

భారత స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో ప్రతీ ఆసీస్ ఆటగాడు వారి గేమ్ ప్లాన్‌లను సిద్ధం చేసుకుని ముందుగా సాగాలని సూచించాడు. ఇలా ముందుకు సాగితే భారత పర్యటనలో అనుకున్న ఫలితాలను తప్పక సాధిస్తామని చెప్పుకొచ్చాడు.

సరైన ప్రణాళిక లేకుండా భారత్‌తో పోరుకు సిద్ధం కాకపోతే, ఈ సిరీస్‌లో తాము ఆశించిన ఫలితాలు ఉండవని పేర్కొన్నాడు. అవసరమైతే మిడ్ ఇన్నింగ్స్‌లో కూడా గేమ్ ప్రణాళికలను మార్చాల్సి ఉంటుందని తెలిపాడు. కోహ్లీ సేన దూకుడుని అడ్డుకోవాలంటే భారత్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+