ప్రపంచకప్‌లో వైఫల్యం.. కోహ్లీసేనపై సమీక్ష సమావేశం లేనట్టే!!

డిల్లీ: ప్రపంచకప్-2019లో కోహ్లీసేన ప్రదర్శనపై సమీక్షించేందుకు సమయం లేదు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం లేదని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ శుక్రవారం స్పష్టం చేశారు. లీగ్ దశలో మొదటి స్థానంలో నిలిచిన భారత్.. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. సెమీస్‌లో బౌలర్లు రాణించినా.. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో సాధారణ స్కోర్ కూడా ఛేదించలేక ఇంటిదారి పట్టింది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

సమయం ఎక్కడుంది:
ఆటగాళ్లు భారత్ వచ్చిన తర్వాత కోహ్లీసేన ప్రదర్శనపై సమీక్ష నిర్వహిస్తామని ఇంతకుముందు వినోద్ రాయ్ తెలిపారు. కానీ ఇప్పుడు సమయం లేదంటున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా బయల్దేరే విషయంపై వినోద్ రాయ్ మాట్లాడుతూ... 'కోహ్లీసేన ఆట తీరుపై సమీక్ష నిర్వహించేందుకు సమయం ఎక్కడుంది?' అని అన్నారు. 'సహాయ సిబ్బంది నుంచి సాధారణ ఫీడ్ బ్యాక్, మేనేజర్ల నివేదిక కోసం ఇంకా ఎదురుచూస్తున్నాం' అని రాయ్ తెలిపారు.

సుప్రీంను కలవనున్న అమికస్:
'నిర్దేశించిన గడువులోపు (సెప్టెంబర్ 14 గడువు) రాష్ట్ర సంఘాల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సాయం చేయడంతో పాటు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై ఏం చేయాలో అమికస్ క్యూరీ సుప్రీంను ఆశ్రయిస్తుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగానే సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఏదో ఒక పదవికి ఎంచుకోవాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రొ కబడ్డీ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా:
వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీతో సమావేశమయ్యాడు. ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లకు విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. టీమిండియా ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ నెల 29న టీమిండియా వెస్టిండీస్‌కు బయలుదేరనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రొ కబడ్డీలో దర్శనమివ్వనున్నారు. శనివారం ముంబైలో జరిగే ప్రొ కబడ్డీ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా విరాట్ కోహ్లీ హాజరుకానున్నారు. యు ముంబా, పునేరి పల్టాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను కోహ్లీ వీక్షించనున్నారు. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఆలపించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications