వయసు 46 ఏళ్లు: అప్పుడే క్రికెట్‌కి వీడ్కోలా?
హైదరాబాద్: శనివారం నుంచి ఆసీస్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కి 38 ఏళ్ల నెహ్రాని సెలక్టర్లు ఎంపిక చేస్తే ఆంతా ఆశ్చర్యపోయారు. లేటు వయసులో కుర్రాళ్లతో నెహ్రా పోటీపడగలడా? అంటూ సోషల్ మీడియాలో సెలక్టర్ల నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు చేశారు.
అయితే ఆస్ట్రేలియాకు చెందిన 47 ఏళ్ల చైనామన్ బౌలర్ బ్రాడ్ హగ్ క్రికెట్‌కి రిటైర్మెంట్ చెప్పకుండా ఇంకా తుది జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. ఫిబ్రవరి 2018లో ఆయన 47వ వసంతంలోకి అడుగుపెడతాడు. వయసు పెరుగుతున్నా క్రికెట్‌కు మాత్రం వీడ్కోలు పలికేదని హగ్ లేదంటున్నాడు

ఈ ఏడాది మోకాలి గాయం కారణంగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి దూరమైన బ్రాడ్ హగ్ శనివారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ గురించి మీడియా ప్రశ్నించగా బ్రాడ్ హగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
'నా వయసు గురించి ఆలోచించడం లేదు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఎందుకంటే దేశం తరఫున ఆడటం ఎప్పటికీ గర్వకారణమే. బాగా ఆడుతున్నంత వరకు వీడ్కోలు ప్రసక్తే లేదు. నాకు తెలుసు.. ఈ వయసులో మళ్లీ ఆసీస్ తరఫున ఆడే అవకాశం రాదని. కానీ.. వస్తే మాత్రం వదులుకోను' అని హగ్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications