For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హెడ్ కోచ్‌ ఎంపికలో కపిల్ కమిటీపై ఎలాంటి ఒత్తిడి లేదు'

No pressure On Kapil Dev-led Panel To Select Next India Coach || Oneindia Telugu
No pressure on Kapil Dev led panel to select next India coach says Ravi Thodge

ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక ప్రక్రియలో కపిల్ దేవ్ కమిటీపై ఎలాంటి ఒత్తిడి లేదు అని సీఓఏ సభ్యుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ రవి తొగ్డె పేర్కొన్నారు. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఈ శుక్రవారం హెడ్ కోచ్ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహించనునుంది. ఈ కమిటీకి కపిల్‌ దేవ్‌ నాయకత్వం వహిస్తున్నారు.

ఆగస్టు 16న హెడ్ కోచ్‌ పదవి కోసం ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను కపిల్ కమిటీ ఇంటర్వ్యూలు చేయనుంది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సీఏవో కమిటీ వీరిని ఇంటర్వ్యూలు చేయనుంది. అదే రోజున ఫలితాలు కూడా ప్రకటించనున్నారు.

మంగళవారం ముంబైలో సీఓఏ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రవి తొగ్డె మాట్లాడుతూ... 'కోచ్ ఎంపికకు సంబంధించి కపిల్ కమిటీపై ఎటువంటి ఒత్తిడి లేదు. సీఏవో ఒక స్వతంత్ర సంస్థ. బీసీసీఐ సూచనల మేరకు ఈ కమిటీ కోచ్‌ను ఎన్నుకుంటుంది' అని రవి తొగ్డె పేర్కొన్నారు. 'కపిల్ కమిటీ ఇంకా నన్ను సంప్రదించలేదు. వారు నా అభిప్రాయం కోరుకుంటే మాత్రం వారితో చర్చిస్తా. రవిశాస్త్రితో జట్టుకు మంచి అనుబంధం ఉంది. అతను కొనసాగితే ఖచ్చితంగా చాలా సంతోషిస్తా' అని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు.

మరోవైపు సీఏవో కమిటీ సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ కూడా బహిరంగంగానే రవిశాస్త్రికి మద్దతు పలకడంతో.. ప్రస్తుత కోచ్‌నే మళ్లీ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. కపిల్ దేవ్ కూడా కోహ్లీతో పాటు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం అని పేర్కొన్నాడు. అయితే కోచ్‌ ఎంపికలో కోహ్లీ అభిప్రాయాల్ని సీఏవో కమిటీ పరిగణనలోకి తీసుకోదని, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోచ్ రేసు రసవత్తరంగా మారనుంది.

Story first published: Wednesday, August 14, 2019, 14:25 [IST]
Other articles published on Aug 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+