సిక్సు కొడతారన్న భయం లేదు: కుల్దీప్ యాదవ్


హైదరాబాద్: విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియాలో ఇప్పడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు కుల్దీప్ యాదవ్. మరి బౌలింగ్ టీంలో కుల్దీప్ యాదవ్‌నే నమ్ముకున్న.. జట్టుకు అతను ఇలా సమాధానమిచ్చాడు.
బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొడతారేమోనన్న భయం తనకెప్పుడూ ఉండదని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. 'నేను క్రికెట్ ఆడడం మొదలు పెట్టినప్పుడు.. బ్యాట్స్‌మెన్ సిక్స్‌లు కొట్టేలా నా కోచ్ కపిల్ పాండే నాతో బౌలింగ్ చేయించేవాడు. అసలు మ్యాచ్‌లో సిక్స్‌లు కొడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు ఆ సాధన నాకు ఉపయోగపడింది' అని చెప్పాడు.

నా కెరీర్ తొలినాళ్లలోనే నేర్చుకున్నా
‘బ్యాట్స్‌మెన్ సిక్స్‌లు కొడితే నేను ఒత్తిడికి గురికాను. ఇలా ఉండడం నా కెరీర్ తొలినాళ్లలోనే నేర్చుకున్నా. సిక్స్‌లు కొడతారని నేను భయపడను. ‘వికెట్లు తీయాలనుకుంటే బంతిని తిప్పాలి. బంతి తిరగట్లేదంటే ఆ స్పిన్నర్.. స్పిన్నర్ కాదని అర్థం' అని చెప్పాడు. కుల్‌దీప్ తమను పూర్తిగా బోల్తా కొట్టించాడని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అన్నాడు. అతడు చాలా బాగా బౌలింగ్ చేశాడని చెప్పాడు.

ఏ పిచ్‌పై అయినా సమర్ధవంతంగా
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో తమ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించడం ఖాయమని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఏ పిచ్‌పై అయినా సమర్ధవంతంగా బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ పర్యటనలో తమ ప్రధాన ఆయుధంగా కోహ్లి అభివర్ణించాడు.

ఆనందాన్నిరెట్టింపు చేసింది
‘ఏ పిచ్‌పై ఆడినా కుల్దీప్ యాదవ్ సమర్థవంతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక పిచ్ నుంచి కొంచెం టర్న్ లభిస్తే అతడి బౌలింగ్ మరింత పదునెక్కుతుంది. ఆ సమయంలో కుల్దీప్ బంతుల్ని బ్యాట్స్‌మెన్ ఎదుర్కోవడం చాలా కష్టం. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆలోచనల్ని అతను సులువుగా చదవగలడు. ఈ పర్యటనలో అతనే మా ప్రధాన ఆయుధం. తొలి టీ20లోనే బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో జట్టు రాణించడం సంతోషంగా ఉంది. ప్రధానంగా యువ ఆటగాళ్లు జట్టు బాధ్యతలు పంచుకోవడంతో ఆ ఆనందాన్నిరెట్టింపు చేసింది' అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.

‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా
మంగళవారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (101 నాటౌట్) సెంచరీ బాదడంతో భారత్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/24) ధాటికి విలవిలలాడిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమవగా.. లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలోనే ఛేదించి అలవోకగా విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications