For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంగక్కర ఆల్‌టైమ్: సచిన్‌కు దక్కని చోటు, ఒకే ఒక్కడు ద్రవిడ్

By Nageshwara Rao

బెంగుళూరు: శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మంగళవారం (జూన్ 28)న వెల్లడించిన ఆల్ టైమ్ XI జట్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చోటు కల్పించలేదు. కుమార సంగక్కర ఎంపిక చేసిన ఆల్ టైమ్ XI జాబితాలో భారత తరుపు నుంచి ఎంపికైన ఒకే ఒక్క ఆటగాడు రాహుల్ ద్రవిడ్ మాత్రమే.

38 ఏళ్ల కుమార సంగక్కర తాను ఎంపిక చేసిన ఆల్ టైమ్ XI జట్టుకు కెప్టెన్‌గా శ్రీలంక మాజీ దిగ్గజం అరవింద్ డిసెల్వాను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ అధికారిక ట్విట్టర్ హ్యాండ్లర్‌ ద్వారా వీడియో రూపంలో వెల్లడించాడు. ఈ వీడియోలో తొలి బంతిని ఎదుర్కొనడంలో మ్యాథ్యూ హెడెన్ దిట్ట అని పేర్కొన్నాడు.

No place for Sachin Tendulkar in Kumar Sangakkara's all-time XI; 1 Indian included

ఇక రెండో స్థానానికి భారత మాజీ కెప్టెన్, అభిమానులు ముద్దుగా 'ద వాల్' పిలుచుకునే రాహుల్ ద్రవిడ్‌ను ఎంపిక చేశానన్నాడు. క్రికెట్‌లో నాకు ఎంతో ఇష్టమైన సర్ వివిన్ రిచర్డ్స్, బ్రియాన్ లారాలను మూడో స్థానానికి ఎంపిక చేయగా, నాల్గవ స్థానంలో రికీ పాంటింగ్‌ను ఎంపిక చేశాడు.

ఆ తర్వాతి స్ధానం ఎంతో ముఖ్యమైందిగా చెప్పుకొచ్చిన ఐదో స్ధానానికి అరవింద్ డిసెల్వా, మహిళా జయవర్దనే మధ్య గట్టి పోటీ ఉందన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ స్ఫిన్నర్లుగా పేరుగాంచిన షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్‌లకు చోటు కల్పించానన్నాడు.

No place for Sachin Tendulkar in Kumar Sangakkara's all-time XI; 1 Indian included

ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్, చిమిందా వాస్‌ల మధ్య కూడా గట్టి పోటీ ఉందని.. అయితే చివరకు తాను చిమిందా వాస్‌‌వైపే మొగ్గు చూపానని చెప్పాడు. ఇలా సంగక్కర ఎంపిక చేసిన ఆల్ టైమ్ XI జట్టులో 4 ఆస్ట్రేలియన్లు, 3 లంకేయులు, ఇండియా, వెస్టిండిస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

కాగా, ఇండియా బ్యాటింగ్ లెజెండ్, ప్రపంచ క్రికెట్‌లో అటు వన్డేలు, ఇటు టెస్టుల్లో అత్యధిక పరగులు చేయడమే కాకుండా క్రికెట్‌లో తన పేరిట రికార్డులు సృష్టించిన సచిన్ టెండూల్కర్‌ పేరుని సంగక్కర ఆల్ టైమ్ XI జాబితాలో ఎంపిక చేయకపోవడంపై సంగక్కర ఆల్ టైమ్ XI జట్టు అంతంత మాత్రంగానే ఉందని అభిమానులు పెదవి విరిచారు.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కుమార సంగక్కర ప్రపంచ క్రికెట్‌లో ఉన్న అత్యత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. 63 సెంచరీలతో (టెస్టుల్లో 38, వన్డేల్లో 25) 27,000 పరుగులు చేశాడు. తన క్రీడా జీవితంలో మొత్తం 134 టెస్టులు, 404 వన్డేలు, 56 ట్వంటీ20 మ్యాచ్‌లను ఆడాడు.

Kumar Sangakkara's All Time XI (In batting order)
1. Matthew Hayden (Australia)
2. Rahul Dravid (India)
3. Brian Lara (West Indies)
4. Ricky Ponting (Australia)
5. Aravinda de Silva (Sri Lanka, Captain)
6. Jacques Kallis (South Africa)
7. Adam Gilchrist (Australia, Wicketkeeper)
8. Shane Warne (Australia)
9. Muttaiah Muralitharan (Sri Lanka)
10. Wasim Akram (Pakistan)
11. Chaminda Vaas (Sri Lanka)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+