ఇది నిజంగా చేదు వార్తే!: ఏ ఒక్క భారత క్రికెటర్‌కు చోటు దక్కలేదు
హైదరాబాద్: ఇది భారత క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్తే. క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన వన్డే లీడింగ్ ప్లేయర్స్ జాబితాలో ఏ ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు లభించలేదు. 2016-17 ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మంగళవారం ఓ జాబితాను విడుదల చేసింది.

అగ్రస్ధానంలో డేవిడ్ వార్నర్
ఈ జాబితాలో వన్డే అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల నుంచి క్రికెటర్లు చోటు దక్కించుకోగా, భారత్ నుంచి ఏ ఒక్క క్రికెటర్‌కి చోటు దక్కలేదు. వన్డే జాబితా బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో నిలిచాడు.

టాప్-5 బ్యాట్స్‌మెన్:
డేవిడ్ వార్నర్ 22 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సెంచరీలతో 1,323 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 179. ఇక రెండో స్ధానంలో నిలిచిన ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ 20 ఇన్నింగ్స్‌ల్లో 1,152 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 16 ఇన్నింగ్స్ ల్లో 931 పరుగులు చేశాడు. దీంతో టాప్-5 జాబితాలో కోహ్లీకి చోటు దక్కలేదు.
David Warner (Australia)
Innings: 22 | Runs: 1,323 | Average: 63 | 100s: 7
Joe Root (England)
Innings: 20 | Runs: 1,152 | Average: 67.76 | 100s: 2
Faf du Plessis (South Africa)
Innings: 22 | Runs: 1,085 | Average: 54.25 | 100s: 3
Babar Azam (Pakistan)
Innings: 22 | Runs: 1,080 | Average: 56.84 | 100s: 5
Quinton de Kock (South Africa)
Innings: 22 | Runs: 1,051 | Average: 47.77 | 100s: 2

టాప్-5 బౌలర్లు
ఇక బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘానిస్థాన్ యువ క్రికెటర్ రషిద్ ఖాన్ అగ్రస్థానంలో నిలవగా, పాకిస్తాన్‌కు చెందిన హసన్ అలీ రెండో స్థానంలో నిలిచాడు. రషిద్ ఖాన్ 20 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీయగా, హసన్ అలీ 21 ఇన్నింగ్స్ ల్లో 42 వికెట్లు తీశాడు.
Rashid Khan (Afghanistan)
Innings: 20 | Wickets: 52 | Average: 22.66 | 5WI: 2
Hasan Ali (Pakistan)
Innings: 21 | Wickets: 42 | Average: 22.66 | 5WI: 2
Adil Rashid (England)
Innings: 19 | Wickets: 39 | Average: 23.23 | 5WI: 1
Mitchell Starc (Australia)
Innings: 17 | Wickets: 36 | Average: 21.05 | 5WI: 0
Liam Plunkett (England)
Innings: 19 | Wickets: 36 | Average: 24.50 | 5WI: 0

టాప్-3 వికెట్ కీపర్స్
ఇక వికెట్ కీపర్ల అత్యుత్తమ ప్రదర్శనలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జాస్ బట్లర్ మొట్టమొదటి స్ధానంలో నిలిచాడు. జాస్ బట్లర్ 20 ఇన్నింగ్స్ ల్లో 35 అవుట్లలో భాగస్వామ్యమయ్యాడు. ఇందులో 29 క్యాచ్‌లు, 6 స్టంపింగ్స్ ఉన్నాయి.
Jos Buttler (England)
Innings: 20 | Catches: 29 | Stumpings: 6 | Average: 1.75
Quinton de Kock (South Africa)
Innings: 22 | Catches: 26 | Stumpings: 3 | Average: 1.32
Matthew Wade (Australia)
Innings: 22 | Catches: 23 | Stumpings: 1 | Average: 1.09
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications