IPL 2025: కోహ్లీకి అవమానం! - కేఎల్ రాహుల్, శ్రేయస్‌కు చోటు
IPL 2025 Top 10 Batters: ఐపీఎల్ 2025 సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 65.33 సగటుతో, 144.11 స్ట్రైక్ రేటుతో 392 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. పైగా ఆరెంజ్ క్యాప్ రేసులోనూ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్సీబీ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది ఆర్సీబీ.. టైటిల్ అందుకుంటుందని అంతా ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోహ్లీ విషయంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పెద్ద తప్పు చేశాడని అభిమానులు అంటున్నారు.
అసలేం జరిగిందంటే?
సంజయ్ మంజ్రేకర్.. తాజాగా ఐపీఎల్ 2025లో టాప్ - 10 బ్యాటర్ల లిస్ట్ ను విడుదల చేశాడు. ఎవరు ఎక్కువ స్ట్రైక్ రేటుతో అత్యధికంగా పరుగులు చేస్తూ, అద్భుతంగా రాణిస్తున్నారో తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఈ జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ అగ్రస్థానంలో ఉంది. పూరన్ 377 పరుగులుతో 204.89 స్ట్రైక్ రేటుతో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 254 పరుగులతో 201.58 స్ట్రైక్ రేటుతో ఉన్నాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. 185.21 స్ట్రైక్ రేటుతో 263 పరుగులు, ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 167 స్ట్రైక్ రేటుతో 373 రన్స్ చేశాడు.

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు జోస్ బట్లర్ (165.58, 356 పరుగులు), గిల్ (153.26, 305 రన్స్).. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ మార్ష్ (161 స్ట్రైక్ రేటు, 344 పరుగులు), ట్రావిస్ హెడ్ (159 స్ట్రైక్ రేటు, 261 రన్స్).. క్లాసెన్ (288 పరుగులు, 157 స్ట్రైక్ రేటు), కేఎల్ రాహుల్ (l323 పరుగులు, స్ట్రైక్ రేటు 154) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే ఆర్సీబీ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ, ఫామ్ లో ఉన్న కోహ్లీ మాత్రం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. దీంతో క్రికెట్ అభిమానులు.. కోహ్లీ పేరు లేకపోవడంపై ప్రశ్నిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications