న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి ‘నో ఓవర్ స్పీడ్ చలాన్’: ముంబై పోలీస్ ట్వీట్ వైరల్

India vs Westindies 2018 : Virat KOhli Has No Over Speed Challan : Mumbai Police | Oneindia Telugu
‘No over-speeding challan’ for Virat Kohli, says Mumbai Police in viral tweet

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.

13వ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ

13వ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ

వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తనకు అచ్చొచ్చిన ఈ మైదానంలోనే తన క్రికెట్ కెరీర్‌లోనే చిర్మస్మరణీయమైన పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో పాటు అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 37 సెంచరీలు నమోదుచేసిన క్రికెటర్‌గానూ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

10 వేల పరుగుల మైలురాయిని

10 వేల పరుగుల మైలురాయిని

205 ఇన్నింగ్స్‌ల్లోనే కొహ్లీ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సైతం బద్దలు కొట్టాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

కోహ్లీతో కలిపి మొత్తం ఐదుగురు

కోహ్లీతో కలిపి మొత్తం ఐదుగురు

ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ సైతం చేరాడు. విండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ వినూత్నంగా

తాజాగా ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ వినూత్నంగా విరాట్ కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేసింది. "విరాట్‌కి నో ఓవర్ స్పీడింగ్ చలాన్... కేవలం అభినందనలు, ప్రశంసలు... అమేజింగ్ ఫీట్ సాధించిన కోహ్లీకి శుభాకాంక్షలు" అంటూ తమ అధికారిక ట్విట్టర్‌లో ముంబై పోలీసులు ట్వీట్ చేశారు.

Story first published: Thursday, October 25, 2018, 18:57 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X