Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదు'

ICC Cricket World Cup 2019 : No One Lost The Final Says Kane Williamson || Oneindia Telugu
No one lost the final, says Williamson

హైదరాబాద్: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. లార్డ్స్ వేదికగా జులై 14న ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఓడించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, సూపర్ ఓవర్‌లో కూడా రెండు జట్ల సమానంగా పరుగులు చేయడంతో 'బౌండరీ రూల్' ప్రకారం ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్‌కు చేరుకున్న కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ ఓటమితో అక్కడి మీడియాతో మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌ జట్టు కప్పు గెలిచిన విజేత.. అంతే తేడా" అని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడినప్పటికీ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో బౌండరీ రూల్ ద్వారా విజేతను ప్రకటించిన విషయంపై కేన్ విలియమ్సన్‌ను మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కేన్ విలియమ్సన్ "ఇలాంటి ప్రశ్నని అడగాల్సి వస్తుందని మీరు కూడా ఊహించి ఉండరనే అనుకుంటున్నా. అలాగే నేను కూడా ఈ విషయంపై సమాధానం చెబుతానని ఎప్పుడూ అనుకోలేదు"' అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

Story first published: Tuesday, July 16, 2019, 18:32 [IST]
Other articles published on Jul 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+