ఆ రాత్రి మేమెవరం భోజనం చేయలేదు: బంగ్లా కెప్టెన్
శ్రీనగర్: ఇటీవల ప్రపంచ కప్ ట్వంటీ 20 సందర్భంగా భారత్ జట్టు చేతిలో ఓటమి పాలైన రోజు తమ జట్టులోని ఏ ఆటగాడు కూడా రాత్రి భోజనం చేయలేదని బంగ్లాదేశ్ సారథి మొర్తజా చెప్పాడు. భారత్ చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాడు.
ఆటలో గెలుపోటములు సర్వ సాధారణమేనని, కానీ ఆ మ్యాచ్‌లో ఓటమి మాత్రం జీర్ణించుకోలేకపోయామని చెప్పాడు. ఆ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకున్నామని చెప్పాడు. కానీ ఓటమి పాలయ్యాక.. తమ జట్టులో ఎవరు కూడా నాటి రాత్రి భోజనం చేయలేదని చెప్పాడు. బంగ్లా కెప్టెన్ జమ్ము కాశ్మీర్లో పర్యటించాడు.

కొద్ది రోజుల క్రితం వరల్డ్ కప్ ట్వంటీ 20 జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ - భారత్ మ్యాచ్ ఉత్కంఠగా జరిగింది. ముఖ్యంగా చివరి ఓవర్ అందర్నీ తీవ్ర ఉత్కంఠకు గురి చేసింది. చివరి మూడు బంతుల్లో ముగ్గురు అవుట్ కావడంతో బంగ్లా ఓటమి పాలైంది. చివరి క్షణం వరకు బంగ్లా పక్షం ఉన్న మ్యాచ్.. ఆ తర్వాత మలుపు తిరిగిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications