
సెలక్టర్లకు ఏం సమాచారమిచ్చారో తెలీదు
"సెలక్టర్లకు ఏం సమాచారమిచ్చారో నాకు తెలీదు. ఇప్పుడు జట్టంతా ఒక్క దగ్గర ఉండడం ముఖ్యం. ప్రపంచకప్ ఫైనల్ చేరలేకపోయినందుకు జట్టులో అంతా నిరాశపడ్డారని తెలుసు. కానీ ఇక దాని గురించి ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి. నిలకడైన బ్యాట్స్‌మెన్‌ను గుర్తించాల్సిన అవసరం ఉంది" అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

ప్రపంచకప్ ఓటమి నిరాశపరిచింది
ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమి తమను నిరాశ పరిచిందని, దానిని మరిచిపోయి ముందుకు సాగిపోవాలని కోహ్లీ ఈ సందర్భంగా తెలిపాడు. టెస్టుల్లో రహానే స్థానంలో రోహిత్ శర్మకు ఎంపిక చేయడంపై కూడా కోహ్లీ స్పందించాడు. రోహిత్ శర్మ అద్భుతమైన ఉన్నందున విండీస్‌తో టెస్టు సిరీస్ కోసం అతడిని తీసుకున్నట్టు కోహ్లీ చెప్పాడు.

రహానేను కాదని రోహిత్ శర్మను ఎందుకంటే
"వెస్టిండిస్‌తో టెస్టు సిరీస్‌లో రహానేను కాదని రోహిత్ శర్మను ఎంచుకున్నాం. రోహిత్ శర్మ ఆడుతున్న తీరే అందుకు కారణం. కానీ రహానే కూడా చాలా మంచి ఆటగాడు. స్లిప్‌లో మంచి ఫీల్డర్ కూడా. అప్పుడే అతడిపై ఓ నిర్ణయానికి రావొద్దు. ముందు ముందు అతడు కూడా వన్డే జట్టులోకి రాగలడు" అని కోహ్లీ వెల్లడించాడు.

యువ ఆటగాళ్లకు మంచి అవకాశం
దీపక్ చహార్, రాహుల్ చహార్, నవ్‌దీప్ సైనీ వంటి యువ ఆటగాళ్లకు విండీస్ పర్యటన మంచి అవకాశమని కోహ్లీ అన్నాడు. వన్డే, టెస్టు జట్లు ఎంతో సమతూకంతో ఉన్నాయని, కొత్త ఆటగాళ్లు వచ్చినందున టీ20 సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని కోహ్లీ చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించామని కోహ్లీ అన్నాడు.


Click it and Unblock the Notifications
