Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఐపీఎల్‍లో ఎవరూ కొనలేదు.. కట్ చేస్తే.. ట్రిపుల్ సెంచరీతో 19 ఏళ్ల రికార్డు బ్రేక్!

IPL 2025: 26 ఏళ్ల ఇంగ్లాండ్ బ్యాటర్ టామ్ బాంటన్ ఐపీఎల్ 2025 మెగావేలంలో పాల్గొన్నాడు. టామ్ బాంటన్ తన బేస్ ధరను రూ.2 కోట్లుగా ఉంచుకున్నాడు. కానీ ఏ ఐపీఎల్ జట్టు అతడిని కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 జరుగుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జాతీయ జట్టు కూడా ఏ మ్యాచ్ ఆడటం లేదు. అటువంటి పరిస్థితిలో టామ్ బాంటన్ దీశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. టామ్ బంటన్ ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సోమర్‌సెట్ జట్టు తరపున ఆడుతున్నాడు. చాలా బాగా రాణిస్తున్నాడు.

సంచలనం సృష్టించిన టామ్ బాంటన్
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సోమర్‌సెట్ తరఫున ఆడుతున్నప్పుడు టామ్ బాంటన్ వోర్సెస్టర్‌షైర్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టామ్ బాంటన్ ట్రిపుల్ సెంచరీ(300 కంటే ఎక్కువ పరుగులు) సాధించాడు. ఇప్పటివరకు టామ్ బాంటన్ 383 బంతుల్లో 344 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 54 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. వోర్సెస్టర్‌షైర్‌ బౌలర్లు అతని ముందు అస్సలు నిలబడలేకపోయారు. పూర్తిగా విఫలమయ్యారు.

No One Bought Him in IPL 2025 But Tom Banton Batters Pears in Record 344 not out

పెద్ద రికార్డును సృష్టించాడు..
టామ్ బాంటన్ ఇప్పుడు సోమర్సెట్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్ అయ్యాడు. టామ్ బాంటన్ జస్టిన్ లాంగర్ 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2006లో జస్టిన్ లాంగర్ సర్రేపై సోమర్సెట్ తరపున 342 పరుగులు చేశాడు. కానీ ఇప్పుడు టామ్ బాంటన్ జస్టిన్ లాంగర్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు. జస్టిన్ లాంగర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కోచ్‌గా ఉన్నాడు.

600 కంటే ఎక్కువ స్కోరు చేసిన సోమర్సెట్
ఈ మ్యాచ్‌లో సోమర్సెట్ ఇప్పటివరకు 637 పరుగులు చేసింది. ఇంకా 4 వికెట్లు మిగిలి ఉన్నాయి. అంతకు ముందు వోర్సెస్టర్‌షైర్‌ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 154 పరుగులు మాత్రమే చేసింది. దీని తర్వాత సోమర్సెట్ తరపున టామ్ బాంటన్, జేమ్స్ రెయు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బాంటన్ ట్రిపుల్ సెంచరీ సాధించగా.. జేమ్స్ 152 పరుగులు చేశాడు. టామ్ బాంటన్ ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరపున కూడా ఆడాడు. టామ్ బాంటన్ 7 వన్డేల్లో 172 పరుగులు, 14 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 327 పరుగులు చేశాడు.

Story first published: Sunday, April 6, 2025, 17:13 [IST]
Other articles published on Apr 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+