For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్యాన్స్‌ కోసం విరాట్ కోహ్లీ ఆసక్తికర పోస్ట్.. అదేంటంటే?!!

No Need To Look Back: Virat Kohlis Inspirational Message For Fans

ముంబై: ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే లాక్‌ అయిపోయారు. ఈ క్రమంలోనే తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఆటగాళ్లు అందరూ ఈ ఖాళీ సమయంలో ఒకవైపు సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటూనే.. మరొకవైపు అభిమానులకు ధైర‍్యం చెబుతున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫ్యాన్స్‌ కోసం ఆసక్తికర పోస్ట్ చేసాడు.

రనౌట్‌ను తప్పించుకున్న కోహ్లీ

రనౌట్‌ను తప్పించుకున్న కోహ్లీ

కరోనా కారణంగా ఏర్పడిన ఈ కఠిన సమయంలో విరాట్ కోహ్లీ ఒక స్ఫూర్తిదాయకమైన మెసేజ్‌ ఇచ్చాడు. మెసేజ్‌తో పాటు అందుకు తగిన ఫొటో ఒకటి షేర్ చేసాడు. గతంలో వెస్టిండీస్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో రనౌట్‌ను తప్పించుకునే క‍్రమంలో మోకాలిని క్రీజ్‌లో ఉంచి మరొక లెగ్‌ను ముందుకు చాచి అలా చూస్తున్న ఫొటోను కోహ్లీ షేర్‌ చేశాడు. విరాట్ క్రీజ్‌ దాటి ముందుకు వెళ్లిన క్రమంలో విండీస్‌ బౌలర్‌ హేడెన్‌ వాల్ష్‌ జూనియర్‌ బంతితో వికెట్లను పడేసే ప్రయత్నం చేశాడు. అయితే కోహ్లీ మాత్రం ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఫోటోనే భారత కెప్టెన్ షేర్‌ చేశాడు.

'వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు

'వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు

ఫోటో షేర్ చేసిన విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చాడు. 'వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మన దారిలో మనం వెళ్లడమే ముఖ్యం' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కరోనా వైరస్‌ కారణంగా అభిమానులకు స్ఫూర్తిదాయకమైన మెసేజ్‌ ఇచ్చాడు. కరోనా వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదని, ముందున్నది మంచి కాలమని చెప్పకనే చెప్పేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ ఫొటోకు ఇప్పటి వరకూ 21 లక్షల మందికి పైగా లైక్‌ చేయగా.. 11వేలకు పైగా కామెంట్స్‌ వచ్చాయి.

అనుష్కతో సరదా సమయం

అనుష్కతో సరదా సమయం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో సమయం గడుపుతున్నాడు. ఆదివారం భారత ఫుట్‌బాల్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రీతో జరిగిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సంభాషణలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అనేక విషయాలను షేర్‌ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ తనపై బయోపిక్ చేయడంలో ఎలాంటి సమస్యలు లేవన్నాడు. అయితే తన బ‌యోపిక్‌లో లీడ్ రోల్ పోషించడానికి మాత్రం ఒక షరతు పెట్టాడు. త‌నపై రూపొందించే బ‌యోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్‌, సతీమణి అనుష్క శ‌ర్మ హీరోయిన్ అయితేనే న‌టించేందుకు సిద్ధ‌మ‌ని కోహ్లీ అన్నాడు.

శంకర్‌ బసూదే క్రెడిట్

భారత క్రికెట్‌ జట్టును ఫిట్‌నెస్‌ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత శంకర్‌ బసూదే అని కోహ్లీ తెలిపాడు. 'నా ప్రస్తుత ఫిట్‌నెస్‌ క్రెడిట్‌ను నేను తీసుకోను. అది శంకర్‌ బసూదే. నా కెరీర్‌లో ఫిట్‌నెస్‌ పరంగా వచ్చిన అతి పెద్ద మార్పు 2015 నుంచి ప్రారంభమైంది. నా కెరీర్‌ మరో స్థాయికి వెళ్లడంలో శంకర్‌ బసూ పాత్ర మరువలేనిది' అని విరాట్ అన్నాడు. 2015 నుంచి 2019 వరకూ భారత క్రికెట్‌ జట్టు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా శంకర్‌ బసూ కొనసాగాడు. ఈ క్రమంలోనే భారత జట్టులో అనేక మార్పులు తీసుకొచ్చాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)లో ఆర్సీబీ ట్రైనర్‌గా కూడా బసూ కొనసాగాడు.

Story first published: Monday, May 18, 2020, 17:35 [IST]
Other articles published on May 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+