డుమినీ ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టు.. కెప్టెన్‌గా కోహ్లీ.. ధోనీకి దక్కని చోటు!!

No MS Dhoni, only two Indians in JP Duminy’s all-time IPL XI

జోహన్నెస్‌బర్గ్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా ఉండడంతో పలువురు ప్రకటిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆట‌గాడు ఆస్ట‌న్ అగ‌ర్, దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్, శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ ప్ర‌పంచ అత్యుత్త‌మ క్రికెట్ జ‌ట్టును ప్రకటించగా.. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ వరల్డ్‌ టెస్టు ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు. తాజాగా దక్షిణాఫ్రికా సీనియర్‌ క్రికెటర్‌ జేపీ డుమినీ తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టును ఎంపిక చేశాడు.

'గేల్‌తో పోల్చితే వార్నర్‌కు బౌలింగ్‌ చేయడమే చాలా కష్టం'

ధోనీకి దక్కని చోటు:

ధోనీకి దక్కని చోటు:

జేపీ డుమినీ తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టులో ఇద్దరు భారత క్రికెటర్లకు చోటు కల్పించాడు. డుమినీ తన జట్టుకు విరాట్‌ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఇక భారత్‌ నుంచి రోహిత్‌ శర్మకు అవకాశం ఇచ్చాడు. ఇక ఐపీఎల్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్‌ ధోనీకి చాన్స్‌ ఇవ్వలేదు. వికెట్ కీపర్‌గా ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చిన డుమినీ.. కనీసం ధోనీకి జట్టులో చోటివ్వకపోవడం విశేషం.

ఓపెనర్లుగా గిల్‌క్రిస్ట్, గేల్‌:

ఓపెనర్లుగా గిల్‌క్రిస్ట్, గేల్‌:

జేపీ డుమినీ తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టుకు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్, క్రిస్‌ గేల్‌లను ఎంపిక చేసుకున్నాడు. రోహిత్‌ శర్మను మూడు, విరాట్‌ కోహ్లీని నాలుగో స్థానాల్లో ఎంచుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో ఏబీ డివిలియర్స్‌, కీరోన్‌ పొలార్డ్‌, ఆండ్రీ రసెల్‌లకు అవకాశం ఇచ్చాడు. పేస్ బౌలర్ల జాబితాలో బ్రెట్‌ లీ, లసిత్‌ మలింగ.. స్పిన్ విభాగంలో ముత్తయ్య మురళీ ధరన్‌, ఇమ్రాన్‌ తాహీర్‌లకు చోటిచ్చాడు. అయితే నలుగురు విదేశీయులు, ఏడుగురు భారతీయుల ఫార్ములాను డుమినీ ఫాలో కాలేదు.

డుమినీ ఆల్‌టైమ్‌ జట్టు ఇదే:

డుమినీ ఆల్‌టైమ్‌ జట్టు ఇదే:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, రోహిత్‌ శర్మ, ఏబీ డివిలియర్స్‌, కీరోన్‌ పొలార్డ్‌, ఆండ్రీ రసెల్‌, బ్రెట్‌ లీ, ముత్తయ్య మురళీ ధరన్‌, లసిత్‌ మలింగ, ఇమ్రాన్‌ తాహీర్‌.

బ్రాడ్ హాగ్ ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టు:

బ్రాడ్ హాగ్ ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టు:

ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆల్‌టైమ్ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. అయితే హాగ్ మాత్రం ఐపీఎల్ రూల్స్ ఫాలో అయ్యాడు.

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ఏబీ డివిల్లీర్స్, ఎంఎస్ ధోనీ, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, మునాఫ్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, May 30, 2020, 17:12 [IST]
Other articles published on May 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more