
ధోనీకి దక్కని చోటు:
జేపీ డుమినీ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టులో ఇద్దరు భారత క్రికెటర్లకు చోటు కల్పించాడు. డుమినీ తన జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఇక భారత్ నుంచి రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చాడు. ఇక ఐపీఎల్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీకి చాన్స్ ఇవ్వలేదు. వికెట్ కీపర్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చిన డుమినీ.. కనీసం ధోనీకి జట్టులో చోటివ్వకపోవడం విశేషం.

ఓపెనర్లుగా గిల్‌క్రిస్ట్, గేల్:
జేపీ డుమినీ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టుకు ఆడమ్ గిల్‌క్రిస్ట్, క్రిస్ గేల్‌లను ఎంపిక చేసుకున్నాడు. రోహిత్ శర్మను మూడు, విరాట్ కోహ్లీని నాలుగో స్థానాల్లో ఎంచుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో ఏబీ డివిలియర్స్, కీరోన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్‌లకు అవకాశం ఇచ్చాడు. పేస్ బౌలర్ల జాబితాలో బ్రెట్ లీ, లసిత్ మలింగ.. స్పిన్ విభాగంలో ముత్తయ్య మురళీ ధరన్, ఇమ్రాన్ తాహీర్‌లకు చోటిచ్చాడు. అయితే నలుగురు విదేశీయులు, ఏడుగురు భారతీయుల ఫార్ములాను డుమినీ ఫాలో కాలేదు.

డుమినీ ఆల్‌టైమ్ జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), క్రిస్ గేల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, కీరోన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్, బ్రెట్ లీ, ముత్తయ్య మురళీ ధరన్, లసిత్ మలింగ, ఇమ్రాన్ తాహీర్.

బ్రాడ్ హాగ్ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు:
ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించాడు. అయితే హాగ్ మాత్రం ఐపీఎల్ రూల్స్ ఫాలో అయ్యాడు.
రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ఏబీ డివిల్లీర్స్, ఎంఎస్ ధోనీ, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, మునాఫ్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.


Click it and Unblock the Notifications












