For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌ టూర్‌కు భారత జట్లు: కోహ్లీనే కెప్టెన్‌.. పంత్‌కు అవకాశం

India vs West Indies 2019 : Team India Squad For WI’s Tour,Kohli Will Lead In All Three Formats
No MS Dhoni for West Indies tour, Saha back in Test squad, India Introduce New Faces in ODI and T20I Squad


ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటగా కోహ్లీ ఈ పర్యటనకు దూరంగా ఉంటాడని వార్తలొచ్చినా.. ఆ తర్వాత విశ్రాంతి అవసరం లేదని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే.
కోహ్లీనే కెప్టెన్‌:

కోహ్లీనే కెప్టెన్‌:

ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి కెప్టెన్‌ కోహ్లీతో పాటు పలువురు బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటించనుంది. ప్రపంచకప్‌ సెమీస్ నుండి టీమిండియా నిష్క్రమించడంతో లిమిటెడ్‌ ఫార్మాట్‌, టెస్టు ఫార్మాట్‌కు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదన వచ్చినప్పటికీ.. సెలెక్టర్లు మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లినే ప్రకటించారు. లిమిటెడ్‌ ఫార్మాట్‌కు రోహిత్‌ శర్మ, టెస్ట్‌లకు అజింక్యా రహానే వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

అయ్యర్‌, పాండేలకు అవకాశం:

అయ్యర్‌, పాండేలకు అవకాశం:

బొటన వేలి గాయం నుండి పూర్తిగా కోలుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపిక చేశారు. టెస్టు ఫార్మాట్‌లో మాత్రం చోటు కోల్పోయాడు. నాలుగో స్థానంలో సెలక్టర్లు యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండేలకు అవకాశం కల్పించారు. భారత్‌-ఏ జట్టు తరఫున విండీస్‌ పర్యటనలో అద్భుతంగా రాణించడంతో జట్టులో చోటు దక్కించుకున్నారు.

పాండ్యా మూడు ఫార్మాట్లకు దూరం:

పాండ్యా మూడు ఫార్మాట్లకు దూరం:

సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ కీపర్‌గా ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు మూడు ఫార్మాట్లకు విశ్రాంతిని ఇచ్చారు. స్టార్ పేసర్ జస్ప్రిత్‌ బుమ్రాను టెస్ట్‌లకు మాత్రమే ఎంపిక చేశారు. టెస్ట్‌ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర పుజారా, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.

టీ20 జట్టులో కుర్రాళ్ళు:

టీ20 జట్టులో కుర్రాళ్ళు:

భువనేశ్వర్‌ కుమార్‌ టెస్ట్‌లకు ఎంపిక కాలేదు. ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లు టెస్ట్‌లకు ఎంపికయ్యారు. రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీలు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. కేదార్‌ జాదవ్‌ వన్డేలకు మాత్రమే ఎంపికయ్యాడు. హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌లు టెస్ట్‌ జట్టులో తమ స్థానం కాపాడుకున్నారు.

టీ20 జట్టు:

టీ20 జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌సైనీ.

వన్డే జట్టు:

వన్డే జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌సైనీ.

టెస్టు జట్టు:

టెస్టు జట్టు:

విరాట్‌కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

Story first published: Sunday, July 21, 2019, 16:46 [IST]
Other articles published on Jul 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+