
హైదరాబాద్: ఏటా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ లో భాగంగా బీసీసీఐ రొటేషన్ పాలసీని తెరపైకి తీసుకొచ్చింది. మరో రెండేళ్ల వరకూ ఢిల్లీలో మ్యాచ్‌లు ఆడకూడదనే సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో వాతావరణ కాలుష్యమే. క్రీడాకారులు ఇబ్బందులు పడుతూ మాస్క్‌లు ధరించి ఆడవలసి వస్తుందని ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. గాలి కాలుష్యం కారణంగా మంగళవారం ఉదయం శ్రీలంక పేసర్ సురంగ లక్ష్మల్ మైదానంలోనే వాంతి చేసుకోగా... ఆ తర్వాత భారత బౌలర్ షమీ మైదానంలో వాంతి చేసుకున్న సంగతి విదితమే.
కాబట్టి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో తీసుకునే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ) కు ఈ నిర్ణయం తోడైంది. పర్యావసానంగా 2020 ఫిబ్రవరి-మార్చి వరకు కోట్లాలో మరో మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువ. 2019లో జరిగే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ) తర్వాత 2020 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ) లో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మ్యాచ్ జరిగేది లేనిది తేలనుంది. ఈ ఏడాది జరిగిన వన్డే, టెస్ట్ మ్యాచ్‌లతో ఫిరోజ్‌షా కోట్లా మైదానానికి ఇక విరామమే.
'క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఎదురుచూస్తోన్న దేశంలోని మిగతా వేదికలకు ఇది సదవకాశమేస. అని బీసీసీఐ సీనియర్ అధికారి మీడియా సమావేశంలో తెలిపారు.