T20 World Cup: ఒక్క టీమిండియా ప్లేయర్ లేడు.. ప్రపంచకప్‌లో భారత్ ఓడిన కారణం ఇదే కదా ..!

అత్యంత ఘోరమైన ఓటమితో ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరిని కూడా అవుట్ చేయలేకపోయింది. దీంతో భారత జట్టుపై, బౌలింగ్ యూనిట్‌పై, రోహిత్ కెప్టెన్సీ అన్ని అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పాక్ మాజీలు భారత బౌలింగ్ యూనిట్‌ను చీల్చిచెండాడారు. భారత బౌలింగ్ అత్యంత పేలవంగా ఉందని, టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ యూనిట్ తమ పాక్ జట్టుదేనని గొప్పలు చెప్పుకున్నారు.

ఒక్క భారత బౌలర్ కూడా లేడుగా..
చివర్లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హర్ష భోగ్లే వంటి అనలిస్టులు కూడా పాక్ బౌలింగ్ అత్యుత్తమంగా ఉందని పొగిడారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఒక్క భారత బౌలర్ కూడా లేడు. ఇది చూసిన అభిమానులు.. ప్రపంచకప్‌లో భారత్ ఓటమికి ఇదే కదా కారణం అంటున్నారు. భారత బౌలర్లు కనీసం 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడానికి కూడా కష్టపడ్డారంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రధాన జట్లన్నీ..
ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ డెలివరీలు వేసిన టాప్-10 బౌలర్లలో దాదాపుగా అన్ని ప్రధాన జట్ల బౌలర్లు ఉన్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక బౌలర్లు కూడా ఉన్నారు. కానీ భారత్ నుంచి ఒక్కరు కూడా లేరు. ఆ పేస్ బలమే భారత్ కొంప ముంచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన బౌలర్ ఇండ్లండ్ పేసర్ మార్క్ వుడ్.. అతను ఏకంగా 154.74 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాతి స్థానంలో కివీస్ పేసర్ లోకీ ఫెర్గూసన్ (154.55) ఉన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో కూడా వేగవంతమైన డెలివరీ వేసిన బౌలర్ ఫెర్గూసన్ అని తెలిసిందే.

టాప్ టెన్ బౌలర్లు వీరే..
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్, కివీస్ పేసర్ లోకీ ఫెర్గూసన్ ఇద్దరూ ఈ ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లుగా నిలిచారు. వీరి తర్వాత వరుసగా ఆన్రిచ్ నోర్యీ (154.31 కిమీ), హారీస్ రవూఫ్ (150.75), మిచెల్ స్టార్క్ (149.95), తస్కిన్ అహ్మద్ (149.46), క్రిస్ జోర్డాన్ (148.74), లాహిరు కుమార (148.24), అల్జారీ జోసెఫ్ (147.82), ప్యాట్ కమిన్స్ (147.37) ఉన్నారు. ఈ టోర్నీలో భారత పేసర్లు మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ ముగ్గురూ కూడా వేగవంతమైన బౌలర్లు కాదని తెలిసిందే. బుమ్రా లేకపోవడంతో కనీసం 140 కిలోమీటర్ల మార్కు దాటే బౌలర్ కూడా భారత్ వద్ద లేకుండా పోయాడు. కొద్దోగొప్పో హార్దిక్ పాండ్యానే ఈ ముగ్గురు ప్రధాన పేసర్ల కన్నా వేగంగా బంతులు విసిరడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications