
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన ఎలైట్ అంపైర్ల ప్యానెల్ జాబితా నుండి ఏకైక భారత అంపైర్ సుందరం రవిని మంగళవారం తొలగించింది. ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్, సంజయ్ మంజ్రేకర్, రంజన్ మడుగల్లె మరియు డేవిడ్ బూన్లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. 2019-20 సీజన్‌కు గాను ఇద్దరు కొత్త అంపైర్లు మైకెల్ గాఫ్ (ఇంగ్లాండ్), జోయల్ విల్సన్ (వెస్టిండీస్)లకు ఎలైట్ అంపైర్ల ప్యానెల్ జాబితాలో చోటు కల్పించారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచంలోని అత్యుత్తమ అంపైర్లలో ఒకరైన ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇయాన్ గౌల్డ్ మెగా టోర్నీ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించారు. ఇయాన్ గౌల్డ్, సుందరం రవి స్థానాల్లో మైకెల్ గాఫ్, జోయల్ విల్సన్‌లను ఎంపికచేశారు. మైదానంలో, టీవీ అంపైర్‌గా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలకు గురైన రవిపై వేటు పడింది. 33 టెస్టులు, 48 వన్డేలు, 18 టీ20ల్లో రవి అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. రవి ఎలైట్ అంపైర్ల ప్యానెల్ నుండి ఉద్వాసనకు గురవ్వడంతో భారత్ నుండి ఒక్క ఎంపైర్ కూడా లేకుండా పోయాడు.
ఇంగ్లాండ్ తరఫున గాఫ్ తొమ్మిది టెస్టులు, 59 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విల్సన్ 13 టెస్టులు, 63 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. అయితే ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీ జాబితాలో ఐసీసీ ఎలాంటి మార్పులు చేయలేదు.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జాబితా:
డేవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, రంజన్ మడుగలే, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగళ్ శ్రీనాథ్.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితా:
అలీం దార్, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గాఫనీ, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, నిగెల్ లాంగ్, బ్రూస్ ఆక్సెన్‌ఫొర్డ్, పాల్ రీఫెల్, టాడ్ టకర్, జోల్ విల్సన్, మైఖేల్ గాఫ్.