మెల్బోర్న్: ప్రపంచ కప్ అనంతరం ఐసీసీ ప్రకటించిన ప్రపంచ కప్ 2015 జట్టులో భారత క్రికెట్ ఆటగాళ్లకు ఎవరికీ చోటు దక్కలేదు. ఇది టీమిండియాకు మరో షాక్ అని చెప్పవచ్చు. ఐసీసీ విడుదల చేసిన ప్రకారం... పోటీలలో రాణించిన భారత బౌలర్లు షమీ (17 వికెట్లు), ఉమేష్ యాదవ్ (18 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (13 వికెట్లు) పేర్లు చర్చకు వచ్చాయి. కానీ, తుది జట్టులో వారికి చోటు దక్కలేదు.
ఈ ప్రపంచ కప్ టోర్నమెంటులో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఉమేష్ యాదవ్ మూడోవాడుగా ఉన్నాడు. మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్డ్ (22)ల తర్వాత హయ్యెస్ట్ వికెట్లు తీసుకుంది ఉమేష్.

న్యూజిలాండ్ సారథి బ్రెండన్ మెకల్లమ్‌కు ఐసీసీ డ్రీమ్ జట్టు పగ్గాలు ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కుమార సంగక్కర, డానియల్ వెట్టోరీలకు స్థానం దక్కింది. టాప్ స్కోరర్ మార్టిన్ గుప్తిల్‌తో పాటు స్టీవెన్ స్మిత్, డివిల్లియర్స్, మాక్స్‌వెల్, కోరీ అండర్సన్‌లకు చోటు దక్కింది. డానియల్ వెట్టోరీ కివీస్ ఏకైక స్పిన్నర్. మిగతా బౌలర్లలో స్టార్క్, బౌల్ట్, మోర్నీ మోర్కెల్‌లను తీసుకున్నారు.
ఐసీసీ డ్రీమ్ ప్రపంచ కప్ 2015: బ్రెండన్ మెకల్లమ్ (కెప్టెన్, న్యూజిలాండ్), సంగక్కర (శ్రీలంక), మార్టిన్ గుఫ్తిల్ (న్యూజిలాండ్), స్మిత్ (ఆస్ట్రేలియా), డివిల్లియర్స్ (సౌతాఫ్రికా), మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), కోరె అండర్సన్ (న్యూజిలాండ్), వెట్టోరి (న్యూజిలాండ్), స్టార్క్ (ఆస్ట్రేలియా), బౌల్ట్ (న్యూజిలాండ్), మోర్కెల్ (సౌతాఫ్రికా), బ్రెండన్ టేలర్ (12వ ఆటగాడు, జింబాబ్వే)