హెల్మెట్ లేకుండా బౌలర్లపై విరుచుకుపడేవాడు.. అతడే పాక్ 'వివ్ రిచర్డ్స్': సక్లయిన్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్‌పై ఆ దేశ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. అప్పటి రోజులలో ఇంజమామ్ పాక్ జట్టుకు ఆణిముత్యంలా దొరికాడన్నాడు. ఇంజమామ్‌ను పాక్ వివ్ రిచర్డ్స్‌గా పోలుస్తారని.. హెల్మెట్ లేకుండానే తన బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడుతుండేవాడని సక్లయిన్ తెలిపాడు. ఇంజీ ఎన్నోసార్లు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడంటూ సక్లయిన్ తన యూట్యుబ్ చానెల్‌లో చెప్పుకొచ్చాడు. ముద్దుగా గేమ్ చేంజర్ అని కూడా పిలిచేవాళ్లమని తెలిపాడు. అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు పొందిన సక్లయిన్.. పాక్ తరపున 49 టెస్టులు, 169 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.

హెల్మెట్ లేకుండానే:
తాజాగా సక్లయిన్ ముస్తాక్ మాట్లాడుతూ... 'ఇంజమామ్ జట్టులోకి వచ్చిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. వచ్చిన మొదటి అవకాశంలోనే తనేంటో నిరూపించుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే భయంకరమైన బౌలర్లు ఉన్న విండీస్ జట్టును ఎదుర్కొన్నాడు. ఎలాంటి భయం లేకుండా తలకు హెల్మెట్ లేకుండానే బ్యాటింగ్‌కు దిగి ప్రంట్ పుట్ షాట్స్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫ్రంట్ ఫుట్, కవర్ డ్రైవ్, కట్ షాట్‌లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇంజీ ఆటను నేను అంత తొందరగా మరిచిపోను' అని అన్నాడు.

అతడి బ్యాటింగ్ ఇమ్రాన్‌ను ఎంతో కట్టుకుంది:
'ఇంజమామ్ జట్టులోకి వచ్చేసరికి ఇప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ఇంజమామ్‌ను ఒకసారి పరీక్షిద్దామని.. అప్పటి జట్టు బౌలర్లైన వసీమ్ అక్రమ్, వకార్ యునీస్‌లను ఇమ్రాన్ కోరాడు. ఈ ఇద్దరు బౌలర్లు తమ పేస్ బౌలింగ్‌తో విరుచుకుపడుతుంటే.. ఇంజమామ్ మాత్రం వారి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంన్నాడు. ఇంజీ ఆట తీరు ఇమ్రాన్‌ను ఎంతో కట్టుకుంది. దీంతో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అరంగేట్రం చేసాడు' అని సక్లయిన్ తెలిపాడు.

గేమ్ చేంజర్, మ్యాచ్ విన్నర్:
'ఇంజీ ఆటతీరుకు ముచ్చటపడిన పాక్ అభిమానులు అతన్ని పాక్ 'వివ్ రిచర్డ్స్'గా అభివర్ణించారు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా ప్రత్యర్థి బౌలర్లకు ఏమ్రాం అవకాశం ఉండకుండా తన ఫ్రంట్ ఫుట్ షాట్లతో విరుచుకుపడేవాడు. ఇంజమామ్ మైదానం ఆవల, బయట ఎంత నెమ్మదిగా కదిలినా.. ఒక్కసారి బ్యాట్ పడితే కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో షాట్లు ఆడేవాడు. నేను ఇంజీతో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడా. ప్రాక్టీస్ సమయంలో స్టంప్ అవుట్ చేసే అవకాశం ఇచ్చేవాడు కాదు. మేం ముద్దుగా గేమ్ చేంజర్, మ్యాచ్ విన్నర్ అని అతన్ని పిలుచుకునేవాళ్ళం' అని సక్లయిన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications