Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొదలైన క్రికెట్ మ్యాచ్‌.. ఇంగ్లండ్ ఆటగాళ్ల మోచేతి సంబరాలు.. వీడియో చూస్తే నవ్వులే!!

No handshakes or high-fives: James Anderson gives first glimpse of post-Coronavirus celebrations in cricket

లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలయ్యాక అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్‌లో పలు కీలక నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మైదానంలోని ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూ ఆడాలి. వికెట్లు తీసినప్పుడు కానీ, మ్యాచ్‌ పూర్తయ్యాక కానీ ఆటగాళ్లు ఆలింగనాలు, చేతులు కలపడాలను ఐసీసీ నిషేధించింది. ఇక బంతికి మెరుపు రాడానికి బౌలర్, ఫీల్డర్ సలైవా (ఉమ్మి) రాయకూడదని కఠిన నియమాలను విధించింది. అయితే ఈ నియమాలను ఇంగ్లండ్ ఆటగాళ్లు తూచాతప్పకుండా పాటించారు.

ప్రాక్టీస్ మొదలు

ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో మూడు నెలలకు పైగా క్రీడాలోకం స్తంభించిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే కొన్ని ఆటలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇక క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆట మొదలవుతుందా అని ఎదురుచూస్తుండగా.. జులై 8 నుంచి ఇంగ్లండ్-వెస్టిండీస్‌ జట్ల మధ్య బయోసెక్యూర్‌ వాతావరణంలో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఆటగాళ్లు బుధవారం రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

మోచేతి సెలబ్రేషన్స్

టీమ్‌ బట్లర్‌, టీమ్‌ స్టోక్స్‌ పేరిట మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగుతోంది. స్టోక్స్‌ జట్టులో ఉన్న ఇంగ్లీష్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌.. బట్లర్‌ జట్టుపై చెలరేగాడు. రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేస్తూ తొలి రోజు రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఐసీసీ క్రికెట్‌లో పలు కీలక నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆండర్సన్‌ తోటి ఆటగాళ్లతో హైఫైలు చేయకుండా మోచేతి సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఈ సంబరాలు చూడడానికి చాలా కొత్తగా ఉన్నాయి. దీనికి సంబందించిన వీడియో, పోటోలను ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అవి కాస్త వైరల్‌ అయ్యాయి.

శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్న ఆండర్సన్‌

శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్న ఆండర్సన్‌

తొలిరోజు మొత్తం 18 ఓవర్లు వేసిన జేమ్స్ ఆండర్సన్‌ కీలక రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రతి ఓవర్ తర్వాత ఆండర్సన్‌ హ్యాండ్‌ శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రపర్చుకోవడం ఫోటోలలో స్పష్టంగా కనిపించింది. ఈసీబీ శానిటైజర్‌లను బౌండరీ పక్కనే ఏర్పాటు చేసింది. ఇక ఆట విరామ సమయంలో క్రికెటర్లకు కూల్‌డ్రింక్స్‌ తీసుకొచ్చే వాళ్లు కూడా చేతులకు గ్లౌస్‌ వేసుకొన్నారు. డ్రింక్స్ తీసుకునే ముందు కూడా ఆటగాళ్లు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. తొలి రోజు బ్యాటింగ్‌ చేసిన బట్లర్‌ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.

 శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు కూడా

శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు కూడా

బుధవారమే శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ క్రికెట్ జట్లు కూడా తమ తమ జట్లలోనే రెండు బృందాలుగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాయి. ఇక్కడ కూడా ఆ రెండు జట్ల ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూ మోచేతులతోనే సంబరాలు చేసుకున్నారు. అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్ల సెలబ్రేషన్స్‌ అందరిని ఆకట్టుకున్నాయి. వీటికి సంబందించిన పోటోలను శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డులు తమ ఖాతాలలో అభిమానులతో పంచుకున్నాయి. అయితే శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ క్రికెట్ జట్లకు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు.

నా రిటైర్మెంట్‌కు అసలు కారణం అదే: డివిలియర్స్‌

Story first published: Thursday, July 2, 2020, 14:50 [IST]
Other articles published on Jul 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+