Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఫైర్ లేదు..ఆ షార్ప్‌నెస్ లేదు: చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకిపారేసిన ఆకాష్ చోప్రా

No firing in batting and no sharpness in bowling, Aakash Chopra on CSKs loss to Sunrisers Hyderabad

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు పరాజయాలు వీడట్లేదు. టోర్నమెంట్ ఆరంభమై ఇన్ని రోజులైనా ఒక్కటంటే ఒక్క గెలుపును కూడా అందుకోవట్లేదు. గత సీజన్ సహా నాలుగుసార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచిన చెన్నై ఒక్క గెలుపు కోసం ఆరాటపడాల్సి వస్తోంది.. తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయినా విజయం మాత్రం వరించట్లేదు. మరోవంక ముంబై ఇండియన్స్ పరిస్థితీ ఇంతే.

ఓటములను కొని తెచ్చుకోవడంలో ఈ రెండు టాప్ ఐపీఎల్ టీమ్స్ పోటీ పడుతున్నట్టు కనిపిస్తోన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్. 2010, 2011, 2018, 2021ల్లో విజేత ఆ జట్టే. పలుమార్లు రన్నరప్‌గా నిలిచింది. 2020లో తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు కూడా వెళ్లలేకపోయింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ చేతిలో ఓటమి పాలైన తరువాత.. ఇప్పటిదాకా కోలుకోవట్లేదు.

రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఆ తరువాత పంజాబ్ కింగ్స్.. నాలుగో మ్యాచ్‌లో చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలోనూ మట్టి కరిచింది. ఈ పరిణామాలు ఆ జట్టుపై ఘాటు విమర్శలకు దారి తీసింది. వరుస పెట్టి విమర్శలు ఎదురవుతున్నాయి. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం జట్టులో లోపాలు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించారు. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. అన్నింటికీ మించి ప్లేయర్లు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా సైతం సీఎస్‌కే ఆటతీరును తప్పుపట్టారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్‌లో ఫైర్ లోపించిందని తేల్చి చెప్పాడు. ప్రత్యర్థికి భారీ టార్గెట్లను నిర్దేశించడంలో గానీ, దాన్ని ఛేదించడంలో గానీ విఫలం కావడానికి ఇదే కారణమని అన్నాడు. నింపాదిగా ఆడటాన్ని అలవాటు చేసుకున్నట్టు కనిపిస్తోందని విమర్శించాడు. అటు బౌలింగ్‌లో కూడా షార్ప్‌నెస్ లేదని, లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులు వేయడంలో బౌలర్లు విఫలం అయ్యారని చెప్పాడు.

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమౌతున్నారని ఆకాష్ చోప్రా అన్నాడు. రుతురాజ్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడినట్టు కనిపిస్తోందిని చెప్పాడు. మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివం దుబే, రవీంద్రజడేజా చేసిన పరుగులు.. సన్‌రైజర్స్‌కు భారీ లక్ష్యాన్ని అందించలేకపోయాయని వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ బౌలర్లు వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఓపెనర్ అభిషేక్ శర్మ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడని చెప్పుకొచ్చాడు. అలాంటి పరిస్థితి చెన్నైలో లేదని పేర్కొన్నాడు.

Story first published: Sunday, April 10, 2022, 14:59 [IST]
Other articles published on Apr 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+