పొవార్‌కు మళ్లీ నో: కొత్త కోచ్ వేటలో బీసీసీఐ, రేసులో ఉన్నదెవరు?

హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ పదవీకాలం శుక్రవారంతో ముగియనుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మళ్లీ కోచ్‌గా రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతడి కాంట్రాక్టును బోర్డు పొడిగించలేదు.
మహిళల వరల్డ్‌కప్ సందర్భంగా పొవార్, సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ నుంచి మిథాలీ రాజ్‌ను తప్పించడంపై పొవార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మిథాలీని తప్పంచడంపై అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం మండిపడ్డారు.
టీ20 వరల్డ్ కప్‌కు ముందే బీసీసీఐ రమేశ్ పొవార్‌ను మహిళల జట్టు తాత్కాలిక కోచ్‌గా నియమించింది. దీంతో ఆగస్టులో కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రమేశ్ పవార్ పదవికాలం నవంబర్ 30తో ముగిసింది. అయితే కోచ్ పదవీకాలం పొడిగించే అవకాశం ఉన్నా.. ఈ విమర్శల నేపథ్యంలో ఆయన్ను కోచ్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ అయిష్టత చూపుతున్నట్లు తెలుస్తోంది.

భారత మహిళల జట్టు స్థాయిని దిగజార్చిందన్న బోర్డు
వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం భారత మహిళల జట్టు స్థాయిని దిగజార్చిందని బీసీసీఐ భావిస్తోంది. అంతేకాదు, భారత మహిళల జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ క్రికెటర్ పట్ల రమేశ్ పొవార్ తీరుపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే రెండోసారి కోచ్ పదవికి అతను దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

కొత్త కోచ్ పదవికి చివరి తేదీ డిసెంబర్ 14
బోర్డు కోచ్‌గా పొవార్‌కు పొడిగింపునివ్వకపోవడంతో అతడికి, మిథాలీరాజ్‌కు మధ్య వివాదానికి తెరపడినట్లేనని భావిస్తున్నారు. ప్లేయర్లకు, కోచ్‌కు మధ్య భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్ర త్తగా వ్యవహరించాలని బోర్డు భావిస్తోంది. ఇక కోచ్ పదవికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీని కూడా నిర్ణయించింది. డిసెంబర్ 14లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

డిసెంబర్ 20న ముంబైలో ఇంటర్యూ
అనంతరం డిసెంబర్ 20న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుందని అధికారులు తెలిపారు. "మహిళల జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. 60 ఏళ్ల వయోపరిమితి అంతకంటే కొంచెం తక్కువ వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

కోచ్ రేసులో ఉన్నదెవరు?
కొత్త కోచ్ రేసులో టామ్ మూడీ, డేవ్ వాట్‌మోర్, వెంకటేశ్ ప్రసాద్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహిళల జట్టు కోచ్ కావాలనుకునే వ్యక్తి ఒక అంతర్జాతీయ జట్టుకు కనీసం ఓ సీజన్ లేదా టీ20 ఫ్రాంఛైజీకి రెండు సీజన్ల పాటు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలని బోర్డు నిబంధన విధించింది. టామ్ మూడీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్‌గా విజయవంతమయ్యారు. వాట్‌మోర్ 1996లో శ్రీలంకను విశ్వవిజేతను చేయడంలో సఫలమయ్యారు. డిసెంబరు 20న ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

దుర్గమ్మను దర్శించుకున్న మిథాలీ
బెజవాడ దుర్గమ్మను భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ దర్శించుకున్నారు. మిథాలీతో పాటు ఇటీవల వరల్డ్ కప్‌లో ఆడిన జట్టు సభ్యులు పలువురు క్రీడాకారిణిలు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. గుంటూరులోను, విజయవాడ సమీపంలోని మూలపాడు స్టేడియంలో నిర్వహిస్తున్న నేషనల్ సీనియర్ ఉమెన్ వన్డే క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చిన భారత మహిళా క్రికెటర్లు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వారికి ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. మిథాలీరాజ్‌తోపాటు మహిళా క్రికెటర్లు పూనమ్ రౌత్, పూనమ్ యాదవ్, నూజాత్ పర్వీన్, రాజేశ్వరి గైక్వాడ్, ఏక్తాబిస్త్‌లు అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. మహిళా క్రికెట్‌లో ఇటీవల జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడేందుకు మిథాలీరాజ్ నిరాకరించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications