భారత్ Vs పాక్: మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల కెప్టెన్లు ఏమన్నారంటే!

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
మ్యాచ్‌కి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు మాట్లాడారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ "పాక్‌తో ఆడటానికి టీమిండియా సిద్ధంగా ఉంది. కానీ ప్రత్యర్థి జట్టు కూడా టైటిల్ మీద కన్నేసింది కాబట్టి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాం. హాంకాంగ్‌పై గెలవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్నాం. ఇప్పుడు పాక్ విషయంలోనూ అదే పద్ధతిని అనుసరిస్తాం" అని అన్నాడు.

పాక్ బలాలు, బలహీనతలపై చర్చించాం
"హాంకాంగ్‌తో మ్యాచ్ పూర్తయిన వెంటనే పాక్ బలాలు, బలహీనతలపై చర్చించాం. పిచ్ పరంగా చూస్తే మాకు అనుకూలం. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లందరూ మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఉన్న భారత జట్టులోని ఆటగాళ్లలో కొంత మంది ఇంగ్లాండ్‌లో ఆడారు. మిగిలిన వాళ్లు మ్యాచ్ వాతావరణంపై దృష్టి సారించడానికి సిద్ధంగా ఉన్నారు" అని రోహిత్ శర్మ తెలిపాడు.
శిఖర్ ధావన్ ఫామ్‌లోకి
"శిఖర్ ధావన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసిరానుంది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో ఫామ్‌లో ఉన్నాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ పాక్‌తో జరిగే మ్యాచ్‌పై ఆసక్తిగా ఉన్నాడు. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు తప్పక రాణిస్తాడని ఆశిస్తున్నాం" అని రోహిత్ శర్మ అన్నాడు.
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ మాట్లాడుతూ
అనంతరం పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ మాట్లాడుతూ "ఛాంఫియన్స్ ట్రోఫీ విజయం ఇప్పుడు మా మైండ్‌లో లేదు. మేం దాన్ని ఆసరాగా చేసుకుని సన్నద్ధం కాలేదు. లండన్ వాతావరణం వేరు. దుబాయ్ పరిస్థితులు వేరు. భారత్‌తో మ్యాచ్ అనగానే కొంత ఒత్తిడి సహజం" అని చెప్పాడు.
మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ ఆడండి
"కానీ మా జట్టు సభ్యులందరికీ నేను చెప్పేది ఒకటే. ఆందోళన అవసరం లేదు. మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ ఆడండి. ఫలితం గురించి పక్కన పెట్టండి. భారత్‌లో దీటైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. వారి దగ్గర్నుంచి మాకు సరైన సవాలు ఎదురవుతుంది" అని సర్ఫ్‌రాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications