Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంక్లిష్టం: వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించలేక పోయిన శ్రీలంక

హైదరాబాద్: శ్రీలంక... దిగ్గజ క్రికెటర్లతో ఒకానొక సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ వెలుగు వెలుగింది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన దేశాల్లో ఒకటి. అలాంటి శ్రీలంక జట్టు ఇప్పుడు వన్డే క్రికెట్‌లో బలహీన జట్టుగా మారింది. ఎంతలా అంటే జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిపోయేంతలా.

ముఖ్యంగా ఇటీవల కాలంలో శ్రీలంక జట్టు ఆటతీరు మరీ తీసికట్టుగా ఉంది. తాజాగా భారత్ చేతిలో వరుసగా నాలుగు వన్డేల్లో ఓడిన శ్రీలంక జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ వరల్డ్ కప్‌ 2019 టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది.

భారత్‌తో వరుసగా నాలుగు వన్డేల్లో ఓడిన శ్రీలంక.. 2019 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలిస్తే లంక (ఎనిమిదో ర్యాంకు) నేరుగా అర్హత సాధించేది. ర్యాంకుల్లో తనకు సమీపంగా ఉన్న వెస్టిండీస్‌ (తొమ్మిదో ర్యాంకు) వచ్చే వన్డేల్లో ఎలా ఆడుతుందనే దానిపై లంక నేరుగా అర్హత సాధించే అవకాశాలు ముడిపడి ఉన్నాయి.

No Direct Entry For Sri Lanka at 2019 World Cup After India Thrashing

2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించాలంటే భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో లంక కనీసం రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాల్సి ఉంది. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య శ్రీలంక ఓటమిపాలైంది. దీంతో శ్రీలంక నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.

సెప్టెంబర్ 30లోగా టాప్-7లో నిలిచిన జట్లతోపాటు ఆతిథ్య జట్టు హోదాలో ఇంగ్లండ్ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. అయితే ఇప్పుడు శ్రీలంక వరల్డ్ కప్‌కు అర్హత సాధించే విషయం ఇప్పుడు వెస్టిండీస్‌ చేతిలో ఉంది. ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లో వెస్టిండీస్‌ ఓడిపోతే శ్రీలంక వరల్డ్ కప్ కోసం నేరుగా బెర్తు దక్కించుకుంటుంది.

చివరి వన్డేలో కోహ్లీసేనపై శ్రీలంక గెలిస్తే దాని ఖాతాలో 88 పాయింట్లు చేరతాయి. వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించడానికి ఆ పాయింట్లు సరిపోవు. సెప్టెంబర్ 30లోగా విండీస్ జట్టు ఆరు వన్డేలు ఆడనుంది. 13వ తేదీన ఐర్లాండ్‌తో ఒక మ్యాచ్ ఆడనున్న విండీస్ జట్టు.. సెప్టెంబర్ 19-29 తేదీల మధ్య ఇంగ్లండ్‌తో ఐదు వన్డేలు ఆడనుంది.

ఈ మ్యాచ్‌ల్లో వెస్టిండిస్ జట్టు విజయం సాధిస్తే దాని ఖాతాలో కూడా 88 పాయింట్లు చేరతాయి. అయితే డెసిమల్ పాయింట్ల అంతరంతో లంకను దాటేసి విండీస్ జట్టు ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. అలా కాకుండా, చివరి వన్డేలోనూ కోహ్లీ సేన చేతిలో లంక ఓడితే.. విండీస్ జట్టు ఆడబోయే ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిస్తే సరిపోతుంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+