ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడనే వార్తల నేపథ్యంలో బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఎట్టి పరిస్థితుల్లోను ఉండదని తేల్చి చెప్పారు.
భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ పాకిస్థాన్ పైన, ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) పైన మండిపడ్డారు.
ఓ వైపు ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయమిస్తూనే, మరోవైపు తమతో క్రికెట్ ఆడాలని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు.

దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు శనివారం కీలకమైన ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో ఆన మాట్లాడారు. దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడం ఆపే వరకూ, వేర్పాటువాదులతో సంప్రదింపులకు స్వస్తి పలికే వరకూ పాకిస్థాన్‌తో క్రికెట్ ఉండదన్నారు.
ఈ డిసెంబర్‌లో యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో సిరీస్ షెడ్యూల్ రూపొందించిన విషయం తెలిసిందే. దీనిపై మొదటి నుంచి నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ మాటలతో ఆ సిరీస్ రద్దు అయినట్లేనని అర్థమవుతోంది.