'కోహ్లీ సంపాదించిన "లెజెండ్" హోదాను సాధించాలని ఉంది'

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదించిన "లెజెండ్" హోదాను సాధించాలని ఉందని పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ అన్నాడు. కోహ్లీతో తనను పోల్చినప్పటికీ అతడిని చేరుకునేందుకు ఇంకా కొంత సమయం ఉందని బాబర్ అజామ్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీకి అభిమానినని చెప్పుకునే 24 ఏళ్ల బాబర్ అజామ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో అటు వన్డే, ఇటు టెస్టుల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని అనిపించుకోవడమే తన ఆకాంక్ష అని తెలిపాడు. ఈ సందర్భంగా బాబర్ ఆజామ్ మాట్లాడుతూ "కోహ్లీ ఇప్పటికే చాలా సాధించాడు. భారత్‌లో అతనో దిగ్గజం" అని అన్నాడు.

కోహ్లీతో పోల్చుకోవడం
"కోహ్లీతో పోల్చుకోవడం లేదు కానీ అతడి స్థాయికి చేరుకోవాలని ఉంది. అభిమానులు, మీడియా నన్ను విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు. కానీ టాప్ ఆటగాడిగా నిలవాలంటే రెడ్ బాల్ క్రికెట్‌లో ఇంకా పరుగులు సాధించిన అవసరం ఉంది. అందుకే ఇటీవలి నెలల్లో నేను టెస్ట్ మ్యాచ్‌లలో స్థిరమైన స్కోర్‌లు పొందడంపై దృష్టి పెడుతున్నాను" అని అన్నాడు.

కోహ్లీ, స్మిత్‌తో పోల్చినంత మాత్రాన
"కోహ్లీ, స్మిత్‌తో పోల్చినంత మాత్రాన ఒత్తిడికి గురి కాను. ఇంకా ఎక్కువగా బ్యాటింగ్‌పై దృష్టి పెడతా. ఇప్పటికే నేను ఆడిన ఇన్నింగ్స్‌ల వీడియోలను గంటలకొద్దీ చూస్తా. అందులో నుంచి తప్పులను గుర్తించి ఆ తర్వాత మ్యాచ్‌ల్లో వాటిని మళ్లీ చేయకుండా చూసుకుంటాను" అని బాబర్ అజామ్ వెల్లడించాడు.

పాక్ తరుపున 24 టెస్టులాడిన ఆజామ్
ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీ సాధించిన బాబర్ అజామ్ ఆ తర్వాత అడిలైడ్‌లో జరిగిన డే-నైట్ టెస్టులో 97 పరుగులు ఫరవాలేదనిపించాడు. కాగా, బాబర్ అజామ్ ఇప్పటివరకు 24 టెస్టులు, 74 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 3 సెంచరీలు చేయగా వన్డేల్లో 11 సెంచరీలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications