ఇండోర్: టీమిండియా ఫేస్ బౌలర్ మహ్మద్ షమీ కుమార్తె ఐసీయూలో ఉన్న విషయం తనకు తెలియదని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టులో విజయం సాధించడంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్‌పై కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 321 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, కోల్‌కత్తా వేదికగా జరిగిన రెండో టెస్టులో జరుగుతున్న సమయంలో మ్యాచ్ ముగియగానే షమీ డ్రెస్సింగ్ రూం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లేవాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన 14 నెలల కుమార్తె అహీరాను ప్రేమగా చూసుకుని తిరిగి ఉదయాన్నే వచ్చి మళ్లీ జట్టుతో కలిసిపోయేవాడు. రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ తన మనసంతా కుమార్తెపైనే ఉండేది. ఈ మ్యాచ్ లో పేసర్లు భువనేశ్వర్, షమి చెలరేగి భారత్‌కు 178 పరుగుల తేడాతో ఘన విజయం కట్టబెట్టారు.
అంకితభావం: కూతురు ఐసీయూలో ఉన్నా.. షమీ మ్యాచ్ ఆడాడు
ఈ మ్యాచ్‌లో షమీ 6 వికెట్లతో రాణించాడు. మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం షమీ కుమార్తె ఆనారోగ్యంతో ఉన్నట్టు కెప్టెన్ కోహ్లీకి తెలిసింది. షమీ మైదానంలో దేనినీ వ్యక్తం చేయడని, తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకోడని కోహ్లీ ఈ సందర్భంగా అన్నాడు.
అందుకే షమీ కుమార్తె ఆసుపత్రిలో ఉన్నట్టు తనకు తెలియదని, మ్యాచ్ ముగిసిన తరువాత తనకు తెలిసిందని కోహ్లీ చెప్పాడు. అందుకే షమీ వ్యక్తిత్వం అంటే అందరికీ ఇష్టమని కోహ్లీ పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ షమీని ఇష్టపడతారని తెలిపాడు. అత్యుత్తమ బౌలర్లలో షమీ ఒకడని కోహ్లీ కొనియాడాడు.