ఐపీఎల్: కోహ్లీ కెప్టెన్సీ మార్పు, తోసిపుచ్చిన ఆర్‌సీబీ యాజమాన్యం

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వచ్చే సీజన్‌లో కెప్టెన్‌ను మార్చబోతుందంటూ వచ్చిన వార్తలను ఆ ఫ్రాంచైజీ ఖండించింది. ఇప్పటికే ఆ జట్టు కోచింగ్ వ్యవస్థలో పలు మార్పులు చేసిన ఆ జట్టు యాజమాన్యం విరాట్ కోహ్లీ స్థానంలో ఏబీ డివిలియర్స్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కోహ్లీని మారుస్తున్నామని వచ్చిన వార్తల్లో నిజం లేదు
దీనిపై ఆ ఫ్రాంచైజీ ఆదివారం వివరణ ఇచ్చింది. కోహ్లీని మారుస్తున్నామని వచ్చిన వార్తల్లో నిజం లేదు. వచ్చే సీజన్‌లోనూ అతనే కెప్టెన్ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అధికార ప్రతినిధి స్పష్టంచేశారు. గత రెండు సీజన్లుగా బెంగళూరు జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఉన్న క్రేజే వేరు.

ప్రతి సీజన్‌లోనూ భారీ అంచనాలతో
ప్రతి సీజన్‌లోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగే ఆ జట్టు ఒక్కోసారి కూడా వాటిని అందుకోలేక పోయింది. జట్టులో హేమాహేమీలు ఉన్నప్పటికీ 11 సీజన్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2017లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ఆ జట్టు, 2018లోనూ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాలేదు.

కోచింగ్ వ్యవస్థలో పలు మార్పులు
దీంతో ఇటీవలే ఆ జట్టు కోచింగ్ వ్యవస్థలో పలు మార్పులు చేసింది. డానియల్ వెటోరీ స్థానంలో మెంటార్, చీఫ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఫీల్డింగ్ కోచ్ ట్రెంట్ వుడ్‌హిల్, బౌలింగ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌లను కూడా తొలగించింది. గత సీజన్‌లోనే కోచింగ్ స్టాఫ్‌లో చేరిన ఆశిష్ నెహ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పగించింది.

ఐపీఎల్‌లో 4948 పరుగులతో రెండో స్థానంలో కోహ్లీ
ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లీని కూడా మారుస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఫ్రాంచైజీ తాజాగా వాటిని ఖండించింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఉన్న విరాట్ కోహ్లీ 2013లో ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 4948 పరుగులతో రైనా తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications