
హైదరాబాద్: ఇప్పట్లో భారత్‌కు పాకిస్థాన్‌కు మ్యాచ్ అనేది ఏమీ జరగదు అంటున్నాడు. ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ షర్యార్ ఖాన్. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్ పాక్‌ల మధ్య మ్యాచ్ జరగకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయం.
ఆయన సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులని బట్టి చూస్తే అసాధ్యమనిపిస్తుందని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులోనూ ఈ రెండు జట్లు తలపడతాయని అనుకోవట్లేదని అభిప్రాయపడ్డారు. ఆ దేశం భారత్‌తో తలపడడానికి సిద్ధంగా ఉందని కానీ, బీసీసీఐ దానికి సుముఖత చూపించపలేదని వాపోయారు.
భారత్ రాజకీయాలు క్రికెట్‌పై చాలా ప్రభావం చూపెడుతున్నాయని అన్నారు. ఇలా ఇరు జట్లు మ్యాచ్‌కు తలపడకపోవడం ఆర్థికంగా ఎంత నష్టపోతామన్నది బీసీసీఐ పట్టించుకోవాలన్నారు. భారత్‌తో ఆడేందుకు పాకిస్థాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. అవకాశం ఇస్తే ఐసీసీ టోర్నమెంట్స్, టీ 20సిరీస్‌లైనా, ఛాంపియన్ ట్రోఫీలైనా ఆడి గెలిచి చూపిస్తాం కానీ, ఆడే ఉద్దేశ్యం లేనప్పుడు మేమేం చేయలేం అని చేతులెత్తేశారు. దరిదాపుల్లో భారత్ తమ దేశంతో మ్యాచ్ ఆడేందుకు ముందుకు రాదనుకుంటున్నాని అభిప్రాయపడ్డారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.