పుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్: పాక్‌తో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదు: గంగూలీ


హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశమే లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. పుల్వామా ఉగ్రదాడిలో నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఐసీసీ ఈవెంట్లలో కూడా పాక్‌తో భారత్ తలపడకూడదన్న పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై తాజాగా సౌరవ్ గంగూలీ స్పందించాడు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని, వీటిలో ఒకదానిని ఆడకున్నా ఏమీ కాదంటూ పరోక్షంగా పాక్‌తో మ్యాచ్ రద్దును ప్రస్తావించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ "ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌పై ప్రజల మనోభావాల్ని నేను అర్థం చేసుకోగలను. పాక్ దుశ్చర్యకి భారత్ ధీటుగా బదులివ్వాలని వారు కోరుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే" అని గంగూలీ చెప్పాడు.

క్రికెట్‌తో పాటు అవి కూడా!
"ఒక్క క్రికెట్ పరంగానే కాదు.. హాకీ, ఫుట్‌బాల్ ఆటల్లోనూ ఆ దేశంతో ఆడకుండా తెగదెంపులు చేసుకోవాలి. భారత్ జట్టు లేకుండా ఐసీసీ ప్రపంచకప్‌ని నిర్వహించడం కష్టం. ఐసీసీని ఎదిరించి పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించే సాహసం చేయగలదా? అనేది ఇప్పుడు తేలాలి. ఉగ్రదాడితో ఇక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశమే లేదు" అని గంగూలీ అన్నాడు.

భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు
వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌పై రోజు రోజుకూ చర్చ పెద్దది అవుతుండటంతో ప్రభుత్వం, బీసీసీఐ పెద్దలు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. దీంతో జూన్ 16న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

మ్యాచ్‌ని నిర్వహించాలా వద్దా?
అయితే, అసలు ఈ మ్యాచ్‌ని నిర్వహించాలా? వద్దా? అనే దానిపై దుబాయి వేదికగా ఫిబ్రవరి 27న జరిగే సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్చించనుంది. వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తుండటంతో దీనిపై ఐసీసీ దృష్టి సారించింది.

పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరిస్తే!
ఒకవేళ ఆ మ్యాచ్‌ను భారత్ బహిష్కరిస్తే పాక్ విజేతగా నిలిచి రెండు పాయింట్లు చేజిక్కించుకుంటుంది. దీంతో పాటు కనీసం రూ.100కోట్లుపైగా మనీని బ్రాడ్‌కాస్టర్స్‌కి నష్టపరిహారం చెల్లించాల్సి రావొచ్చు. అయితే, పాక్‌తో మ్యాచ్ ఆడకపోవడంపై బీసీసీఐ సైతం ఇప్పటి వరకు ఐసీసీతో సంప్రదింపులు జరపలేదు.

వరల్డ్‌కప్ నుంచి పాక్‌ను నిషేధించాలి
మరోవైపు వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ శశాంక్ మనోహార్‌ను సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ డ్రాప్ట్ నోట్‌ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌ను వరల్డ్‌కప్ నుంచి నిషేధించపోతే వరల్డ్‌కప్ నుంచి తామే తప్పుకుంటామని ఆ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications