For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది క్లియర్!: 'పాక్‌తో ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు'

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడిచి పెట్టేంత వరకు ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవని కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయెల్‌ స్పష్టం చేశారు. త్వరలో దుబాయిలో జరగనున్న బీసీసీఐ, పీసీబీ సమావేశంప

By Nageshwara Rao

హైదరాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడిచి పెట్టేంత వరకు ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవని కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయెల్‌ స్పష్టం చేశారు. త్వరలో దుబాయిలో జరగనున్న బీసీసీఐ, పీసీబీ సమావేశంపై ఆయన సోమవారం స్పందించారు.

'పాక్‌తో క్రికెట్ ఆడే విషయమై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత బీసీసీఐ ఏ నిర్ణయమైన తీసుకుంటే మంచిది. పాక్ ఉగ్రవాదాన్ని విడిచి పెట్టే వరకు ఆ దేశంతో ద్వైపాక్షిక సిరిస్ ఆడే పరిస్థితి లేదు. అయితే ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రం అడ్డు చెప్పడం లేదు' అని గోయెల్‌ అన్నారు.

No bilateral cricket with Pakistan, says Sports Minister

అంతకముందు క్రికెట్‌, కబడ్డీ, హాకీ లీగుల్లో పాల్గొనేందుకు పాక్‌ ఆటగాళ్లు భారతగడ్డపై అడుగు పెట్టేందుకు వీల్లేదని గోయెల్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2015-2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ, పీసీబీలు ఒప్పందు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత భారత్‌పై పాక్‌ పదేపదే ఉగ్రదాడులకు దిగడం, సైనిక ఉల్లంఘనలకు పాల్పడడంతో ఇరుదేశాల మధ్య రాజకీయ, దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో పాకిస్థాన్‌తో సిరిస్‌లు ఆడేందుకు బీసీసీఐ విముఖత చూపిస్తోంది.

అయితే తమతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సిరీస్‌లు ఆడకపోవడంతో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని.. దీనికి పరిహారం చెల్లించాలని బీసీసీఐకి ఇటీవలే పీసీబీ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే.

పాక్ నోటీసులకు బీసీసీఐ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈ ఒప్పందం చట్టబద్ధం కాదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై చర్చించేందుకు రెండు బోర్డులు మే 29న దుబాయ్‌లో సమావేశం అవుతున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+