Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేకేఆర్‌కు షాకిచ్చిన గంభీర్.. కీలక ప్రకటన

టీమిండియా కొత్త కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతానే ఉంది. ఈ పదవికి బీసీసీఐ దరఖాస్తుల కోరినప్పటి నుంచి రోజుకో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకుంటాడని ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. కోచ్ పదవికి గంభీర్ అసలు అప్లై చేయలేదని కొన్నిరోజులు వార్తలు చక్కర్లు కొట్టాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ప్రేమ, షారుక్ ఖాన్‌పై ఉన్న అభిమానంతో గంభీర్ భారత కోచ్ పదవికి ఆసక్తి చూపట్లేదనే ప్రచారం సాగింది. ఐపీఎల్‌లో కేకేఆర్ మూడో విజయవంతమైన జట్టు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టు కోల్‌కతానే. సీఎస్కే, ముంబై చెరో అయిదు ట్రోఫీలు సాధించగా కేకేఆర్ మూడు సార్లు విజేతగా నిలిచింది. 2012, 2014లో గంభీర్ సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచింది.

No Bigger Honour Gautam Gambhir Expresses Desire to Coach Indian Team

తాజాగా ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ కేకేఆర్ టైటిల్ అందుకోవడంలో గంభీర్‌ది కీలక పాత్ర. మెంటార్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గంభీర్ తిరిగి కోల్‌కతా గూటికి చేరుకోవడంతో జట్టులో ఎంతో మార్పు చేసుకుంది. దీంతో గంభీర్‌ను సుదీర్ఘ కాలం ఫ్రాంచైజీతో కొనసాగించాలని షారుక్ ఖాన్ బ్లాంక్ చెక్ కూడా ఆఫర్ చేశాడని తెలిసింది. అయితే కేకేఆర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు, భారత కోచ్ పదవి అందుకోనున్నట్లు గంభీర్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆడే టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తించడానికి మించిన మరో అరుదైన గౌరవం ఉండదని గంభీర్ తాజాగా పేర్కొన్నాడు. ''భారత జట్టు కోచ్‌గా ఉండటాన్ని ఇష్టపడతా. జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి మించిన మరో గొప్ప గౌరవం ఏదీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల భారతీయుల తరఫున ప్రాతినిథ్యం వహించినట్లే'' అని గంభీర్ అన్నాడు.

టీమిండియా కొత్త కోచ్ 2027 డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోచ్‌గా ఎంపికైతే కేకేఆర్‌కు గంభీర్ 2027 వరకు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్ ఏ ఫ్రాంచైజీకి సేవలు అందించరాదు.

Story first published: Sunday, June 2, 2024, 21:05 [IST]
Other articles published on Jun 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+