సెలక్టర్ల పిలుపు ఊహించలేదు: న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికపై శుభ్‌మాన్

హైదరాబాద్: తన అరంగేట్రానికి న్యూజిలాండ్‌ను మించిన మంచి ప్రదేశం లేదని పంజాబ్ యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ అన్నాడు. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు సస్పెన్షన్‌కు గురి కావడంతో ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు వన్డేలు, న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లో భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ స్థానాల్లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్‌లతో సెలెక్టర్లు భర్తీ చేశారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులుగా విజయ్ శంకర్‌కు అవకాశం కల్పించగా, జనవరి 23న మొదలయ్యే కివీస్‌తో సిరీస్ కోసం పంజాబ్ యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌కు తొలిసారి అవకాశమిచ్చారు.
ఈ నేపథ్యంలో శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ "న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికవ్వడం చాలా అనుకూలం. నేనక్కడ అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేశాను. మళ్లీ అక్కడే నాకు అవకాశం వచ్చింది. అక్కడ నా టెక్నిక్‌ను పెద్దగా మార్చుకోనక్కర్లేదు. తుది జట్టులో అవకాశం వస్తే ఒత్తిడిని అధిగమిస్తే చాలు. టీమిండియాకు ఆడటం భిన్నంగా ఉంటుంది" అని అన్నాడు.

సెలక్టర్ల పిలుపు ఊహించలేదు
"అందుకు సిద్ధంగా ఉన్నా. సెలక్టర్ల పిలుపు ఊహించలేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఎంపిక చేశారో అర్థం చేసుకోగలను. నా మనసులో ఓ లక్ష్యం పెట్టుకున్నా. ఇప్పటి వరకు ఆడిన అన్ని స్థాయిల్లో బాగా రాణించా. అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తానన్న నమ్మకం ఉంది. గతేడాది ఆదే సమయంలో న్యూజిలాండ్‌లో వరల్డ్‌కప్ ఆడేందుకు వెళ్లా" అని శుభ్‌మాన్ చెప్పుకొచ్చాడు.

అండర్-19 వరల్డ్‌కప్ గెలుపుతోనే
"ఇప్పుడు అదే సమయంలో టీమిండియాకు పిలుపొచ్చింది. ఐపీఎల్, రంజీల్లో నాకు మంచి పేరు వచ్చింది. అండర్-19 వరల్డ్‌కప్ గెలుపుతోనే అది మొదలైంది" అని శుభ్‌మాన్ గిల్ అన్నాడు. అండర్-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన గిల్.. 2018లో గిల్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 203 పరుగులు చేశాడు.

రంజీల్లో పంజాబ్ తరుపున పరుగుల మోత
తన సొంత రాష్ట్రం పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 10 ఇన్నింగ్సుల్లో 98.75 సగటుతో 790 పరుగులు చేశాడు. ఇందులో తమిళనాడుపై డబుల్ సెంచరీ(268)తో పాటు హైదరాబాద్‌పై(148) సూపర్ సెంచరీ ఉన్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చొప్పున గిల్ పరుగుల మోత మోగించాడు. ఈ మధ్య జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఎ తరఫున అదరగొట్టాడు.

కివీస్‌తో పర్యటనకు ఎంపిక
ఇప్పుడు అదే కివీస్‌తో పర్యటనకు ఎంపికైన శుభ్‌మాన్.. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నాడు. అండర్-19 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పృథ్వీషా సహచరుడైన గిల్ ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు ఎంపికవుతాడని యువీ, దినేశ్ కార్తీక్ ముందే అంచనా వేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications