న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చర్యల్లేవ్, భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నాం!: రాయుడి సెటైరిక్ ట్వీట్‌పై బీసీసీఐ

ICC Cricket World Cup 2019 : No Action On Ambati Rayudu For Sarcastic Tweet : BCCI Official
No action on Rayudu for sarcastic tweet: BCCI official

హైదరాబాద్: అంబటి రాయుడు సెటైరికల్ ట్వీట్‌పై ఎలాంటి చర్యలు తీసుబోమని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వరల్డ్‌కప్‌లో రాయుడికి చోటు దక్కుతుందని!

వరల్డ్‌కప్‌లో రాయుడికి చోటు దక్కుతుందని!

గత కొన్ని నెలలుగా ఈ జట్టులో చోటు దక్కించుకుంటారని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేసే సమయంలో అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని, చివరికి విజయ్ శంకర్‌‌వైపు మొగ్గు చూపామని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.

శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు

శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు

"NO.4 స్పాట్‌లో అంబటి రాయుడు, విజయ్ శంకర్‌లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్‌ బ్యాటింగ్‌, బౌలింగే కాదు మంచి ఫీల్డర్‌ కూడా. దీంతో శంకర్‌ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్‌ ఎంతగానో ఆకట్టుకున్నాడు" అని ఎమ్మెస్కే అన్నాడు.

‘3డీ' కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ ట్వీట్

‘3డీ' కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ ట్వీట్

దీంతో ఎమ్మెస్కే వ్యాఖ్యలపై అంబటి రాయుడు వ్యంగ్యంగా వచ్చే వరల్డ్‌కప్‌ను ‘3డీ' కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. రాయుడి ట్వీట్‌పై బుధవారం బీసీసీఐ స్పందించింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ "రాయుడు చేసిన ట్వీట్‌ను మేం నోట్‌ చేసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అతని భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నాం" అని అన్నారు.

రాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోడం లేదు

రాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోడం లేదు

"అయితే, హద్దులు మీరకుండా ఆవేదనను బయటపెట్టుకోవాల్సిన అవసరం రాయుడిపై ఉంది. ఈ బాధ నుంచి తేరుకోవడానికి రాయుడికి కొంత సమయం పడుతోంది. దీనిని మేం అర్థం చేసుకోగలం. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోడం లేదు. ఎందుకంటే అతడు స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. జట్టులో ఎవరైన గాయపడితే రాయుడికి అవకాశం దక్కుతుంది. ఇంగ్లాండ్‌కి పయనమవుతాడు" అని ఆయన తెలిపారు.

Story first published: Wednesday, April 17, 2019, 19:06 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X