Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ రెడ్డి.. ధోనీ రికార్డు సమం!

అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదన పూర్తిచేసింది. నాథన్ మెక్‌స్వీనీ(10 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా(9 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు 128/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 36.5 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. నితీశ్ కుమార్ రెడ్డి(42; 47 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్(5/57) అయిదు వికెట్లు, స్కాట్ బొలాండ్(3/51) మూడు, మిచెల్ స్టార్క్(2/60) రెండు వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులు చేసింది.

Nitish Reddy Joins MS Dhoni in Elite List of Top Scores at No 7 or Lower for India in Tests

మొదటి ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ రెడ్డి (42; 54 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు)నే టాప్ స్కోర్. ఆసీస్ 337 పరుగులు సాధించింది.ట్రావిస్ హెడ్ (140; 141 బంతుల్లో, 17 ఫోర్లు, 4 సిక్సర్లు), లబుషేన్ (64; 126 బంతుల్లో, 9 ఫోర్లు) సత్తాచాటారు. అయితే భారత రెండు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏడో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వచ్చి ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన భారత నాలుగో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

అంతకుముందు ముగ్గురు భారత క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 1961-62లో కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో చందు బోర్డే, 2011లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఎంఎస్ ధోనీ, 2018లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించారు. తాజాగా అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో నయా ఆల్‌రౌండర్ నితీశ్ సత్తాచాటి ఈ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు.

Story first published: Sunday, December 8, 2024, 16:53 [IST]
Other articles published on Dec 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+