‘పరిస్థితులు మారుతాయి.. మనకూ మంచి రోజులు వస్తాయ్’.. టీమ్ సెలెక్షన్‌పై నితీశ్ రాణా సెటైర్స్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టు వివరాలను చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ ఆదివారం వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌ పేస్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌, పంజాబ్ కింగ్స్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్‌కు ఊహించినట్లే జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

రాహుల్ సారథ్యంలో..

రాహుల్ సారథ్యంలో..

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడంతో కేఎల్‌ రాహుల్‌ జట్టును నడిపించనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి ఐపీఎల్‌లో రాణిస్తోన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తిరిగి జట్టులోకి రాగా.. ఈ సీజన్‌లో తన ఫినిషింగ్‌ నైపుణ్యంతో ఆకట్టుకున్న వెటరన్‌ ప్లేయర్ దినేశ్‌ కార్తీక్‌ 36 ఏళ్ల వయసులో పునరాగమనం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మోహ్‌సిన్ ఖాన్ కూడా ఎంపికవుతాడని అంతా భావించగా.. గాయం కారణంగా సెలెక్టర్లు అతన్ని పేరును పరిశీలించలేదు.

త్రిపాఠికి మొండిచెయ్యి..

త్రిపాఠికి మొండిచెయ్యి..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన రాహుల్ త్రిపాఠికి సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 37.54 సగటుతో 158.23 స్ట్రైయిక్ రేటుతో 413 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో గత 8 సీజన్లుగా ప్రతీ సీజన్‌లోనూ 400+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి కూడా ఈ సిరీస్‌లో అవకాశం దక్కలేదు. 14 మ్యాచ్‌ల్లో 361 రన్స్ చేసిన కేకేఆర్ బ్యాటర్ నితీశ్ రాణాను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే అవకాశం దక్కని ఆటగాళ్లంతా సైలెంట్‌గా ఉండగా.. నితీశ్ రాణా మాత్రం పరోక్ష వ్యాఖ్యలతో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

హర్ట్ అయిన నితీశ్ రాణా

హర్ట్ అయిన నితీశ్ రాణా

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై నితీశ్ రాణా ట్విటర్ వేదికగా స్పందించాడు. 'పరిస్థితులన్నీ త్వరలోనే మారుతాయి.' అంటూ ఇన్‌డైరెక్ట్ ట్వీట్ చేశాడు. పరోక్షంగా ఉన్నా టీమిండియాలో సెలెక్షన్ గురించే రాణా ఈ ట్వీట్ చేశాడని స్పష్టంగా అర్థం అవుతోంది. గతేడాది శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో నితీశ్ రాణాకి చోటు దక్కింది. టీమిండియా తరుపున ఓ వన్డే, రెండు టీ20 మ్యాచులు ఆడిన నితీశ్ రాణా, మొత్తంగా చేసింది 22 పరుగులే. ఫామ్‌లో లేని లంకపై కూడా పరుగులు చేయలేక రాణా తీవ్రంగా నిరాశపరిచాడు.

సౌతాఫ్రికాతో బరిలోకి దిగే టీ20 జట్టు:

సౌతాఫ్రికాతో బరిలోకి దిగే టీ20 జట్టు:

కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్‌ కార్తీక్, హార్దిక్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్‌ పటేల్, అవేష్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్‌ మాలిక్‌.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 23, 2022, 18:22 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X