Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా vs హైదరాబాద్: మ్యాచ్ గమనాన్ని మార్చేసిన రనౌట్

Nitish Rana’s silly dismissal turned the match, says Dinesh Karthik

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. ఒకానొక దశలో హైదరాబాద్ 174పరుగులు చేసినప్పటికీ కోల్‌కతా మెరుపు వేగంతో ఆరంభించిన ఇన్నింగ్స్ చూసి హైదరాబాద్ అభిమానులంతా ఆశలు గాలికొదిలేశారు. అలాంటి సమయంలో నితీశ్ రాణా రనౌట్ మ్యాచ్ దిశను మార్చేసింది. ఈ విషయాన్ని కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ స్వయంగా వెల్లడించాడు.

175 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా జట్టు 8.2 ఓవర్లు ముగిసే సమయానికి 87/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ.. ఈ దశలో లేని పరుగు కోసం ప్రయత్నించి నితీశ్ రాణా (22) రనౌటవగా.. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప (2), దినేశ్ కార్తీక్ (8), ఆండ్రీ రసెల్ (3) క్రీజులో కుదురుకునేలోపే పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఒత్తిడికి గురైన కోల్‌కతా ఆఖరికి 160/9కే పరిమితమైంది.

'నితీశ్ రాణా రనౌట్ మ్యాచ్‌ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అతను మరికొంతసేపు క్రీజులో ఉండింటే కోల్‌కతా గెలిచేది. కీలక సమయంలో.. పేలవంగా అతను రనౌటయ్యాడు. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప కూడా చెత్త షాట్ ఆడాడు. అంతకముందే రాణా ఔటైన నేపథ్యంలో ఉతప్ప రివర్స్ స్వీప్‌ కోసం ప్రయత్నించి బౌల్డవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు' అని దినేశ్ కార్తీక్ పెదవి విరిచాడు.

ఒకవేళ రాణా రనౌటవకుండా ఉండింటే.. తప్పకుండా మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచేదని కార్తీక్ వెల్లడించాడు. రషీద్ ఖాన్ వేసిన స్ట్రైయిట్ డెలివరీని రివర్స్ స్వీప్ ఆడేందుకు ఉతప్ప ప్రయత్నించగా.. బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి లెగ్ స్టంప్‌ని గీరాటేసింది.

Story first published: Sunday, May 27, 2018, 10:54 [IST]
Other articles published on May 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+