Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గట్ల ఉంటది అమ్మతోటి! ప్రెస్ కాన్ఫరెన్స్ ఆపేసిన నితీష్ రెడ్డి! (వీడియో)

టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ మైదానంలో కాకుండా.. బయట కూడా అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాడు. శనివారం ధర్మశాల వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. నితీష్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా.. హఠాత్తుగా అతని ఫోన్ మోగింది. అది తన తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అని గమనించిన ఈ యువ క్రికెటర్.. ఏ మాత్రం ఆలోచించకుండా ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కాసేపు పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన తల్లి ఫోన్ కాల్‌కు స్పందించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

ఆ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి తన తల్లితో తెలుగులో మాట్లాడిన మాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. "అమ్మా నేను మళ్లీ చేస్తాను.. ఫైవ్ మినట్స్" అని ఎంతో వినయంగా ఆమెకు సర్ది చెప్పి.. 5 నిమిషాల్లో తిరిగి కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి నిదర్శనంగా నిలిచిన ఈ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. "పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ వేచి ఉండగలదు కానీ, అమ్మ కాల్ అస్సలు ఆగలేదు" అనే శీర్షికతో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి విజయం, గుర్తింపు లభించినప్పటికీ, నితీష్ తన మూలాలను మర్చిపోకుండా వ్యవహరించిన తీరుపై క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'అమ్మ ఫోన్‌కు ఎప్పుడూ ప్రాధాన్యతే', 'అమ్మతో అట్లుంటది మరి' అంటూ కామెంట్లు చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Nitish Kumar Reddy Wins Hearts as He Pauses Press Meet for Mom s Call After India vs Afghanistan ODI Match

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ధర్మశాల స్టేడియంలో జరిగిన ఈ మొదటి వన్డేలో ఆఫ్ఙనిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో 31 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ సెంచరీతో రాణించినప్పటికీ.. మిడిల్, డెత్ ఓవర్లలో నితీష్ పరుగులను నియంత్రించి జట్టుకు కీలకమైన బ్రేక్ త్రూలు అందించాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ(16), శుబ్‌మన్ గిల్(84), ఇషాన్ కిషన్ (34), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) రాణించడంతో టీమిండియా సునాయాసంగా విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఆటతో ఆకట్టుకున్న నితీష్, మ్యాచ్ అనంతరం అమ్మపై ఉన్న ప్రేమతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

Story first published: Sunday, June 14, 2026, 9:35 [IST]
Other articles published on Jun 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+