ఒక్క స్పీచ్‌తో ముంబై ఇండియన్స్ టీమ్ పరువంతా తీసేసాడు (వీడియో)
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో(DAIS) జరిగిన క్లాస్ ఆఫ్ 2026 గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సాధారణంగా ఎమోషనల్‌గా, సీరియస్‌గా సాగే ఉపన్యాసాలకు భిన్నంగా ఈ కుర్రాడు తన ప్రసంగంలో హాస్యాన్ని జోడించి అందరినీ ఆకట్టుకున్నాడు. అంబానీ కుటుంబానికి చెందిన IPL ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఆడిటోరియంలోని ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్కూల్‌లో గడిపిన క్షణాలను స్నేహితులతో పంచుకున్నమధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు గురించి చెబుతూ గ్రాడ్యుయేషన్ తర్వాత మన జీవితంలో కూడా మన ముంబై ఇండియన్స్ (MI)జట్టులాగే కూడా కొన్నిసార్లు కష్టమైన సీజన్‌లు ఉంటాయి అని అతడు వ్యాఖ్యానించాడు.

ఈ పంచ్ లైన్‌తో ఆడిటోరియం మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది. అక్కడ ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నవ్వు ఆపుకోలేకపోయారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్, స్కూల్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కూడా తన ముఖాన్ని చేతులతో కప్పుకుని పకపకా నవ్వడం కనిపించింది.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ముంబై ఇండియన్స్ ప్రదర్శనతో ముడిపెట్టాడు. "జీవితంలో ఏదీ సక్రమంగా జరగనట్లు అనిపించే రోజులు వస్తాయి. మనం పెట్టిన కృషికి తగ్గ ఫలితాలు రానప్పుడు, ప్రతీదాన్నీ ప్రశ్నించాలనిపిస్తుంది. అయితే ఈ ఫ్రాంచైజీ మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పింది. అదేంటంటే.. మనం ఎంత కష్టాల్లో ఉన్నా మనం ఎవరో, మన వారసత్వం ఏంటో ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే మనకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ విస్మరించకూడదని అని గుర్తుచేశాడు.
Student make fun of Mumbai Indians in front of Nita Ambani
— Jeet (@JeetN25) May 24, 2026
- Look at reaction of Nita Ambani. 🤣🤣 pic.twitter.com/xk3Ih0IhNP
చివరగా ముంబై ఇండియన్స్ జట్టు నినాదమైన "దునియా హిలా దేంగే హమ్"(మనం ప్రపంచాన్ని కదిలిద్దాం) అంటూ అతను తన ప్రసంగాన్ని ముగించాడు. ఈ మాటకు నీతా అంబానీ ఎంతో సంతోషంగా చప్పట్లు కొడుతూ అభినందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications