రోహిత్‌కు నీతా అంబానీ స్పెషల్ అవార్డు.. బుజ్జగింపులు షురూ! (Video)
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో అంబానీ ఫ్యామిలీ బుజ్జగింపులు షురూ చేసింది. ముంబై ఫ్రాంచైజీకి రోహిత్ గుడ్ బై చెబుతాడనే భయంతో వేగంగా చర్యలు చేపడుతోంది. హిట్ మ్యాన్ ముంబై జట్టుతోనే ఉండేలా ఆ ఫ్రాంచైజీ సహయజమాని నీతా అంబానీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కాస్త సమయం దొరికితే చాలు, రోహిత్‌తో ఆమె కబుర్లు చెబుతున్నారు.
రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు సారథి బాధ్యతలు అందించన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ముంబై ఇండియన్స్ జట్టులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జట్టు రెండు గ్రూప్‌లుగా ఏర్పడింది. ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించి ముంబై ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ఐపీఎల్-2024లో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ముంబై పదో స్థానంతో సీజన్‌ను ముగించింది.

అంతేగాక ఫ్రాంచైజీ నిర్ణయంపై రోహిత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, ఈ సీజన్ ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్‌తో బంధానికి ముగింపు పలుకుతాడని జోరుగా ప్రచారం సాగింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడింది. కథనాలకు తగ్గట్లుగానే.. ఈ మ్యాచ్‌లో ఔటై పెవిలియన్‌కు చేరుతున్న రోహిత్‌కు స్టేడియంలోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇదంతా చూస్తే రోహిత్‌కు ముంబై ఫ్యాన్స్ ఫేర్‌వెల్ ఇస్తున్నట్లుగా అనిపించింది.
దీంతో మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో రోహిత్‌తో కలిసి నీతా అంబానీ ప్రత్యేకంగా మాట్లాడారు. ముంబై ఫ్రాంచైజీతోనే ఉండమని రోహిత్‌కు సర్దిచెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేగాక డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్ మ్యాన్‌కు నీతా ప్రత్యేక అవార్డు ఇచ్చారు. రోహిత్ 38 బంతుల్లో 68 పరుగులు చేశాడని, స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడని, అందుకే ఈ అవార్డు అని చెప్పారు.
కానీ వాస్తవానికి రోహిత్ కంటే కుర్రాడు నమన్ ధిర్ అద్భుతంగా ఆడాడు. 28 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. ముంబైను దాదాపు గెలిపించేంత పనిచేశాడు. ముంబై ఓటమి ఖాయమని భావించిన తరుణంలో గొప్పగా పోరాడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు. కానీ నమన్‌కు అవార్డు ఇవ్వకుండా రోహిత్‌కు ప్రత్యేక మెడల్స్ ఇవ్వడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే రోహిత్‌తో బుజ్జగింపులు చేస్తున్నట్లుగా అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications