హైదరాబాద్‌లో ఐసీసీ వరల్డ్‌కప్ ట్రోఫీ: ఆవిష్కరించిన సినీ నటి వర్షిణి

హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీ వరల్డ్‌కప్ టూర్‌లో భాగంగా 'వన్డే వరల్డ్‌కప్' బుధవారం మన నగరమైన హైదరాబాద్‌కు చేరుకుంది. గచ్చిబౌలిలోని నిస్సాన్ షోరూమ్‌లో అభిమానుల సందర్శనార్థం వరల్డ్‌కప్ ట్రోఫీని ఉంచారు.
ప్రముఖ టాలీవుడ్ నటి వర్షిణి ఈ వరల్డ్‌కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ట్రోఫీతో పాటు న్యూ నిస్సాన్ కిక్స్ కారును ఆమె ప్రీలాంచ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ 2019 వరల్డ్‌కప్‌ను కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గెలవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

నిస్సాన్ షోరూమ్ ఎండీ సిరాజ్ బాబూఖాన్ మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ నిస్సాన్ షోరూమ్ ఎండీ సిరాజ్ బాబూఖాన్ కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐసీసీ వరల్డ్ కప్ మెగా టోర్నీకి నిస్సాన్ కంపెనీ అధికారిక భాగస్వామిగా ఉందని చెప్పారు. మన రోడ్లకు అనుగుణంగా న్యూ నిస్సాన్ కిక్స్ కారును రూపొందించారని పేర్కొన్నారు.

మే 30 నుంచి జులై 14 వరకు వరకు వన్డే వరల్డ్‌కప్
వచ్చే సంక్రాంతి నాటికి భారత మార్కెట్‌లోకి ఈ కారు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. కాగా, వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది. టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 30న ఓవల్ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

మొత్తం 10 జట్లు
రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు.

ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ ఆతిథ్యం
జూలై 14న జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఆడబోయే అన్ని మ్యాచ్‌ల టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయానని ఐసీసీ ప్రకటించింది. జూన్ 16న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-భారత్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు ఒక్కటి కూడా మిగల్లేదని ఐసీసీ పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications