For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో శతకాల మోత.. ఇప్పటివరకు ఎన్ని బాదారంటే?

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచులు పూర్తవ్వగా... గ్రూప్‌-ఎ సెమీస్‌ బెర్తులు కూడా ఖరారైపోయాయి. రెండేసి విజయాలతో టీమిండియా, న్యూజిలాండ్‌ నాకౌట్‌కు అర్హత సాధించగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ టోర్నీలో సెంచరీల వరద పారుతుండటం విశేషం. ఆటగాళ్ల తమ ధనాధన్ ఇన్నింగ్స్ తో బౌండరీలు, సిక్స్ లు బాదుతూ శతకాలు నమోదు చేస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్ని సెంచరీలు నమోదయ్యాయి? ఎవరెవరు శతకాలు బాదారు? ఓ లుక్కేద్దాం..

తొలి రెండు మ్యాచుల్లో నాలుగు శతకాలు..
ఓపెనింగ్ మ్యాచ్ పాకిస్థాన్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా రెండు శతకాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ ప్లేయర్లు టామ్ లాథమ్ 104 బంతుల్లో 118 (నాటౌట్) సెంచరీ బాదగా.. విల్ యంగ్ 113 బంతుల్లో 107 రన్స్ చేశాడు. రెండో మ్యాచ్ లోనూ (బంగ్లాదేశ్ - భారత్) రెండు శతకాలు బాదడం విశేషం. తౌహిద్ హృదోయ్ 118 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్ ల సాయంతో 100 శతకొట్టాడు. ఇదే మ్యాచ్ లో టీమిండియా స్టార్ శుభ్ మన్ గిల్ 101 మరో శతకంతో చెలరేగాడు.

Nine Centuries scored by kohli rachin and others in Six matches champions trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీలోనే రికార్డ్ స్కోర్..
అప్ఘానిస్థాన్ - సౌతాఫ్రికా మ్యాచ్ లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ రికెల్టన్ 103 సెంచరీతో చెలరేగాడు. ఇదే మ్యాచ్ లో అప్ఘాన్ ప్లేయర్ రహ్మత్ షా 90.. శతాకానికి చేరువగా వచ్చి ఔట్ అయ్యాడు. నాలుగో మ్యాచ్ లో ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనే రికార్డ్ స్కోర్ నమోదైంది. ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ (165) ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. ఇదే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జోష్ ఇంగ్లీష్ 120 కొట్టి తన జట్టును గెలిపించుకున్నాడు.

Take a Poll

సెంచరీతో ఫామ్ లోకి విరాట్ కోహ్లీ..
భారత్ పాక్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ (నాటౌట్) బాది ఫామ్ లోకి వచ్చాడు. 111 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో ఈ స్కోర్ సాధించాడు. తన స్థాయికి తగ్గట్టుగా దూకుడుగా ఆడకపోయినప్పటికీ శతకం బాదడంతో ఫ్యాన్ ఖుషీ అయ్యారు.

తాజాగా బంగ్లాదేశ్ - న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత సంతతి ప్లేయర్ రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 12×4, 1×6 సాయంతో 112) తన జట్టుకు విజయాన్ని అందించాడు. అలా ఇప్పటివరకు 6 మ్యాచుల్లోనే 9 సెంచరీలు నమోదు కావడం విశేషం. చూడాలి మరి ఇంకెన్ని శతకాలు నమోదు అవుతాయో..

Story first published: Tuesday, February 25, 2025, 10:08 [IST]
Other articles published on Feb 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+