For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎన్ని వైర‌స్‌లు వ‌చ్చినా మేం భయ‌ప‌డం.. యూ కాంట్ స్టాప్ అస్ (వీడియో)

Nike’s new viral ad is an editing marvel and it sure hits the spot

ఒరెగాన్ (యునైటెడ్ స్టేట్స్): ఓ ప్రకటన (అడ్వ‌ర్టైజింగ్) వస్తువు యొక్క అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపగలదు. సదరు ప్రకటన ఆ వస్తువు వెనుక ఉన్న ఆలోచన మరియు ఉద్దేశ్యాన్ని తెలియజేస్తుంది. ప్ర‌ఖ్యాత స్పోర్ట్ అడ్వ‌ర్టైజింగ్ కంపెనీ నైక్.. తమ స్పోర్ట్ ప్రకటనల ద్వారా ప్రజలను చాలా వేగంగా ప్రభావితం చేస్తుంది. అయితే తాజా ప్రకటన క్రీడా ప్రపంచంలోని ఎన్నో మధుర క్షణాలను కళ్లముందుంచింది. ప్రపంచాన్ని వణికిస్తున్న క‌రోనా వైర‌స్‌కు బ‌య‌ప‌డేది లేదంటూ ఉత్తేజ‌ప‌రిచే సందేశం ఇచ్చింది.

క‌రోనా వైర‌స్ దాటికి విశ్వ‌వ్యాప్తంగా అన్ని ర‌కాల క్రీడ‌లు స్తంభించిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అన్ని ర‌కాల క్రీడ‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స్పోర్ట్ అడ్వ‌ర్టైజింగ్ కంపెనీ నైక్ క‌రోనా వైర‌స్‌కు బ‌య‌ప‌డేది లేదంటూ త‌న ట్విట‌ర్ ద్వారా మంచి సందేశం ఇచ్చింది. దాదాపు 1.39 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో అన్ని ర‌కాల క్రీడ‌ల‌తో పాటు 36 మంది పాత‌త‌రం, కొత్త‌త‌రం ఆట‌గాళ్ల‌ను కలిపి చూపించింది.

వీడియోలో ర‌ఫెల్ నాద‌ల్‌, నోవాక్ జొకొవిచ్‌, టీమిండియా క్రికెట్‌ మ‌హిళ‌ల జట్టు, క్రిస్టియానో రొనాల్డొ, సెరెనా విలియ‌మ్స్‌, లెబ్ర‌న్ జేమ్స్‌, కొలిన్ కెపెర్‌నిక్ లాంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉన్నారు. వీడియోకి యూ కాంట్ స్టాప్ స్పోర్ట్‌.. యూ కాంట్ స్టాప్ అస్ అంటూ క్యాప్ష‌న్ జ‌త చేశారు. మనం కలిసి చేయగలిగేదాన్ని ఏదీ ఆపలేదు అని నైక్ పేర్కొంది. 'వీ ఆర్ నెవ‌ర్ ఎలోన్..' అంటూ వీడియో మొదలవుతుంది. ఈ వీడియోకు అమెరిక‌న్ సాక‌ర్ ప్లేయ‌ర్ మేడన్ రాపినో వాయిస్ ఓవ‌ర్ అందించారు.

'క‌రోనా వైరస్ లాంటి ఎన్ని వైర‌స్‌లు వ‌చ్చినా.. మేం భయ‌ప‌డం. అథ్లెట్స్‌గా మేం ఎప్పుడు ఒంట‌రివాళ్లం కాదు. మేమంతా ఐక్యంగా ఉంటూనే.. ఏ విష‌య‌మైనా క‌లిసే పోరాడుతాం. మేం కలిసి చేయగలిగేదాన్ని ఏదీ ఆపలేదు. మా ఆట‌లే మ‌మ్మ‌ల్ని ఈరోజుకు ఐక్యంగా ఉండేలా చేశాయి. క‌రోనా వైర‌స్ ఆట‌కు మ‌మ్మ‌ల్ని దూరం చేసినా.. తిరిగి మ‌ళ్లీ అదే శక్తితో క‌ల‌సిక‌ట్టుగా వ‌స్తున్నాం' అంటూ మేడన్ రాపినో చెప్పారు. ప్ర‌స్తుతం నైక్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక్క‌రోజులోనే దాదాపు 13 మిలియ‌న్ల మంది వీక్షించారు.

Story first published: Friday, July 31, 2020, 21:00 [IST]
Other articles published on Jul 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+