For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వంతెనపై నుంచి పడిన బస్సు.. 21 మంది అథ్లెట్లు మృతి

Nigeria: నైజీరియాలో అథ్లెట్లను తీసుకెళ్తున్న బస్సు వంతెన పైనుంచి పడిపోవడంతో 21 మంది అథ్లెట్లు మరణించారు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఆ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలా మంది అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు ఆ బస్సులో ఉన్నారు. వారందరూ ఓగున్ రాష్ట్రంలో జరిగిన క్రీడా ఉత్సవంలో పాల్గొన్న తర్వాత కానో రాష్ట్రం వైపు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో బస్సు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయింది. బస్సులోని ప్రయాణికులను వెంటనే అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

నైజీరియాలో రహదారులు చాలా పేలవంగా నిర్వహించబడుతున్నాయి. ఇది దేశంలో ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీని కారణంగా వివిధ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 2024లోనే 9,570 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీరిలో 5,421 మంది మరణించారు. నైజీరియా ఒక చిన్న దేశం అని పరిగణనలోకి తీసుకుంటే.. ఇనని ప్రమాదాలు జరగడం ఆ దేశంలోని రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడాన్ని సూచిస్తోంది.

Nigeria Bus Accident 21 Athletes Killed as Bus Falls Off Flyover

ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. బస్సు వంతెనపై నుంచి కింద పడిపోయినప్పుడు రోడ్డుపై ఇతర వాహనాలు లేవన.. డ్రైవర్ అలసట, అతివేగం మాత్రమే కారణమని తెలిసింది. ఈ ప్రమాదం రాత్రిపూట జరిగింది. డ్రైవర్ విరామం తీసుకోకుండా వాహనాన్ని నడుపుతున్నాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సుమారు 1000 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

Story first published: Sunday, June 1, 2025, 12:27 [IST]
Other articles published on Jun 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+